350 పడకల రామగుండం (గోదావరిఖని) ఆసుపత్రి 10 నెలల్లో పూర్తి చేయాలి.....*
* జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
* నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించాలి
* సిబ్బంది సమయపాలన పాటిస్తూ త్వరగా స్కానింగ్ పరీక్ష ఫలితాలు అందించాలి
* రామగుండం ఆసుపత్రి నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
*జనం న్యూస్, డిసెంబర్ 25, పెద్దపల్లి రూరల్ ప్రతినిధి*
రామగుండం ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న 350 పడకల ఆసుపత్రి పనులు రాబోయే 10 నెలలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష రామగుండంలో నూతనంగా నిర్మాణం అవుతున్న ఆసుపత్రి పనులను, గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని, రామగుండం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష* రామగుండంలో 350 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను తనిఖీ చేసి పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ దశలో ఉన్న పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం ప్రకారం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు 10 నెలలలో అందుబాటులోకి నూతన ఆసుపత్రి భవనాన్ని తీసుకుని రావాలని అన్నారు. గో