మెదక్ చర్చి వందేళ్ళ ఉత్సవాలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి*
*ఏడుపాయల దుర్గ భవాని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం*
జనం న్యూస్ 2024 డిసెంబర్ 25 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)
ప్రత్యేక విమానం ద్వారా ఏడుపాయలకి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవిన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
పి. సి.సీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ దామోదర్ రాజనర్సింహ, ఘనంగా స్వాగతం పలికిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే, సంజీవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అనంతరం పూర్ణ కుంభం తో స్వాగతం పలికి గర్భ గుడిలోకి తీసుకెళ్లిన ఆలయ పూజారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్గ భవాని మాత కు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి ఆలయ పూజారుల ఆశీర్వాదం తీసుకున్నారు.తర్వాత 750 కోట్ల పైచిలుకు రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి మెదక్ చర్చికి బయలుదేరారు.
*ఏడుపాయలలో శంకుస్థాపన చేసిన పనుల వివరాలు**మెదక్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ..750 .కోట్ల పైచిలుకు విలువైన పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల లో శంకుస్థాపన*