ఆపదలో ఆదుకోవడంలో ముందున్న డైనమిక్ లీడర్ పబ్బ మహేష్ గుప్తా

ఆపదలో ఆదుకోవడంలో ముందున్న డైనమిక్ లీడర్ పబ్బ మహేష్ గుప్తా

పోతులబోగూడలో బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచిన ఆపద్బాంధవుడు తాజా మాజీ జెడ్పిటిసి  పబ్బ మహేష్ గుప్త...

మంద నాగులు, చాకలి నర్సయ్య కుటుంబాలకు మహేష్ గుప్త ఆర్థికసాయం..

చెందిలో నిజ్జని శ్రీకాంత్, నిజ్జని చంద్రయ్య కుటుంబాలకు ఆర్థిక  సహకారం....

   జనంన్యూస్ సెప్టెంబర్5.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

మండలంలోని పోతులబోగూడ గ్రామంలో ఇటీవలే మరణించిన మంద నాగులు కుటుంబానికి ప్రముఖ సంఘ సేవకులు ఆపద్బాంధవుడు శివంపేట తాజా  మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త తనవంతు సహాయంగా తన స్వంత డబ్బులు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గురువారం గ్రామ నాయకుల చేతులమీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఇదే గ్రామానికి చెందిన చాకలి నర్సయ్య మృతి చెందగా బాధిత కుటుంబానికి తనవంతు సహాయంగా పబ్బ మహేష్ గుప్త తన స్వంత డబ్బులు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. ఈసందర్బంగా తాజా మాజీ జెడ్పిటిసి పబ్బమహేష్ గుప్త మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ఆర్థికంగా వారి కుటుంబాలకు  ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు మహేష్ గుప్తా అన్నారు  ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముల్కని నాగరాజు గౌడ్, పత్రాల శ్రీకాంత్ గౌడ్, స్వామిగౌడ్, అంజి, అశోక్, బాలకృష్ణ,మైసయ్య, తదితరులు పాల్గొన్నారు.@ చెందిలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహకారం.. @
మండల పరిధిలోని చెంది గ్రామంలో నిజ్జని శ్రీకాంత్ ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రముఖ సంఘ సేవకులు ఆపద్బాంధవుడు తాజామాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త తనవంతు సహకారంగా తన స్వంత డబ్బులు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గురువారం బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఇదే గ్రామానికి చెందిన నిజ్జని చంద్రయ్య ఇటీవలే మరణించగా ఆతని దశదినకర్మకు అవసరమైన నిత్యావసర సరుకులను పబ్బ మహేష్ గుప్త అందించి బాధిత కుటుంబానికి కొంత బాసటగా నిలిచారు. పబ్బమహేష్ గుప్తకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు  ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షులు పుల్లగూర్ల ముత్యంరెడ్డి, వెంకటరెడ్డి, నర్సారెడ్డి, ఆంజనేయులు, లచ్చయ్య, చాకలి మల్లయ్య, మహేష్, బిక్షపతి, కృష్ణ, వీరేష్, కుమ్మరి సురేష్, తదితరులు పాల్గొన్నారు.