ఇదెక్కడి ఆచారం రా దేవుడా..! కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అంటే ఇదే..
జనం న్యూస్: సైన్స్ ఎంత వేగంగా దూసుకుపోతుందో అందరికి తెలుసు..అంత అన్నీ అద్బుతాలను మనం చుస్తున్నాము.. ముఖ్యంగా మనుషులు గగనంలోకి కూడా కాలు పెడుతున్నారు.. అలాంటి కాలంలో ఉన్న మనం మూఢ నమ్మకాలను కూడా ఎక్కువగా నమ్ముతున్నారు.. వీటి కోసం చాలా మంది ప్రాణాలును కూడా బలి ఇస్తున్నారు. ఎందరో వీటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటూన్నారు. ఒక్కో ప్రాంతం లో ఒక్కో విధమైన ఆచారాలు బయటకు వస్తున్నాయి. వాటిని చూసిన చాలా మంది నోర్లు వెల్లబెడుతున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వస్తుంది. పట్టణాలలో దేవుడిని నమ్మడం, పూజించేవాల్లు చాలా తక్కువ.. కానీ మన దేశంలోని గ్రామాల లో మాత్రం మూఢనమ్మకాలు ఎక్కువే.పెద్ద పెద్ద జాతరలు నిర్వహిస్తారు. జంతు బలులు ఇస్తారు. గ్రామ దేవతల పూజా కార్యక్రమాలన్ని డిఫరెంట్గా ఉంటాయి. వింత వింత ఆచార సంప్రదాయాలు ఉంటాయి..కొన్ని భయంకరంగా ఉంటే, మరి కొన్ని మాత్రం షాక్ ఇస్తున్నాయి.. అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. దున్నపోతులతో థొక్కించుకొనె ఒక ఆచారం ఒకటి అందరినీ ఆష్చర్యానికి గురి చెస్తుంది.అమ్మో..ఇది వినడానికి భయంకరంగా వున్న ఇది నిజమే. వివరాల్లొకి వెళితే.. ఈ దారుణమైన ఆచారం ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసింది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోనూ గ్రామీణ దేవతలకు జాతరలు నిర్వహిస్తారు. యు.కొత్తపల్లి మండలం అమినాబాధ్ గ్రామంలో పోలెరమ్మ జాతరలో వింత ఆచారాం ఉంది.. అక్కడకు వచ్చిన భక్తులు దున్నపోతులతో అలా చేస్తారు.అలా చేయడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం.అమావాస్య ముందురోజు జరిగే పోలెరమ్మ జాతరలో ఈ వింత ఆచారం ఏళ్లుగా వస్తోంది. చిన్నలు, పెద్దలు, మహిళలు, యువకులు రోడ్డుపై వరుసగా బోర్లా పడుకుంటారు. వారి పై నుంచి అమ్మవారు పూనిన మహిళ దున్నపోతును తీసుకోని వెళ్తుంది. కొన్నేళ్లుగా ఈ ఆచారం వస్తుందని అలా చాలా మంది కోరికలు కూడా తీరాయని వాళ్ళు అంటున్నారు.