*ఉచిత ఇసుక హామీ తక్షణమే అమలు చేయాలి*
*ఈనెల 4న రాష్ట్రవ్యాప్త ఆందోళన ను జయప్రదం చేయండి*
అచ్యుతాపురం(జనం న్యూస్):టీడీపీ కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని, అందరికీ ఇసుక అందుబాటులో తెచ్చి అవినీతిని అరికట్టి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపాలని మండలం లోని హరిపాలెం,దోసూరు,
అచ్యుతాపురంలో భవన నిర్మాణ కార్మికులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం అచ్యుతాపురం కన్వీనర్ ఆర్.రాము సీఐటీయూ మండల కన్వీనర్ కే. సోమనాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఇసుక లభించకపోవడం రేట్లు పెరిగి విచ్చలవిడి అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని ప్రజల సమస్యలు పట్టకుండా కనీసం భవన నిర్మాణాలు చేస్తున్న ప్రజలకు గాని ఈ రంగంపై ఆధారపడిన కార్మికులకు గాని ప్రయోజనం లేకుండా పోయిందని వంద రోజుల కాలంలో ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని అన్నారు.ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని ఈ నెల 4 న జరిగే ఆందోళనలో కార్మికులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కె.రాజు, శ్రీను,రమేష్, రాజు ,రాజాన అప్పలనాయుడు, బాబురావు, హరి ,వసంత తదితరులు పాల్గొన్నారు.