*ప్రత్యేక అలంకరణతో సిద్ధమైన దుర్గాదేవి విగ్రహాలు!*

*ప్రత్యేక అలంకరణతో సిద్ధమైన దుర్గాదేవి విగ్రహాలు!*

అచ్యుతాపురం(జనం న్యూస్):దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలో మూడు అడుగుల నుంచి 20 అడుగుల ఎత్తున్న దుర్గాదేవి విగ్రహాలను హరిపాలెంకు చెందిన కళాకారులు తయారు చేశారు.వారి కళానైపుణ్యంతో

వివిధ రూపాల్లో తయారు చేసిన విగ్రహాలు

పలువురిని ఆకట్టుకుంటున్నాయి.

డిజైన్లను బట్టి

రూ.1000 నుండి రూ.

20 వేల వరకు విక్రయిస్తున్నారు.

ఈ సందర్భంగా

తంగేటి సత్యనారాయణ,

మునగపాక శివ,విగ్రహాల

తయారీకి కావాల్సిన ముడి సరుకు రంగులు,

కొబ్బరి పీచు, కళాకారుల వేతనాలు, విగ్రహాల తయారీకి తీసుకునే ఖాళీ స్థలాల అద్దెలు పెరగడంతో విగ్రహాల తయారీ ఖర్చు ఎక్కువగా ఉందని గిట్టుబాటు ధర కూడా రావడం లేదని నిర్వాహకులు తెలుపుతున్నారు. విగ్రహాల తయారీ నిర్వహకులు

తంగేటి లోవరాజు,

దేవరపు చిన్న,మునగపాక మురళి, మునగపాక సన్యాసిరావు, దేవారపు శేఖర్ పాల్గొన్నారు.