ఎందక్కా నువ్వు చేసిన పని. సిగరెట్ తాగనివ్వలేదని పెట్రోల్ బంకును కాల్చేసిన మహిళ.

జనం న్యూస్: మనిషికి కోపం రావడం సహజం. అయితే కోపం మనిషికి అతి పెద్ద శత్రువు అని అంటారు. ఎందుకంటే కోపంలో ఉన్న వ్యక్తి మంచి చెడు విచక్షణ కోల్పోతాడు. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవును ఎవరైనా సరే కోపంలో ఉన్న సమయంలో ఏమి చేస్తాడో అతనికే తెలియదు. ఒకొక్కసారి వ్యక్తి పతనానికి కూడా కోపం కారణం అవుతుంది. కొంతమందికి కోపం రావడానికి చిన్న కారణం చాలు. ఇలా క్షణ కాలం వచ్చిన కోపంతో కొట్లాటలు, హత్యలు జరిగిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది. సిగరెట్ తాగడానికి ఇవ్వలేదని ఓ వ్యక్తి కారును ఓ మహిళ తగులబెట్టింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక మహిళ తనకు సిగరెట్ తాగడానికి ఇవ్వలేదని కోపంతో పెట్రోల్ బంకు వద్ద ఉన్న ఒక వ్యక్తి కారుకు నిప్పు పెట్టడం చూడవచ్చు. వైరల్ వీడియో @PicturesFolder పేరుతో X ఖాతాలో భాగస్వామ్యం చేయబడింది. “స్త్రీ తనకు సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించినందుకు పురుషుడి కారుకు నిప్పు పెట్టింది” అని క్యాప్షన్ తో షేర్ చేశారు. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి పెట్రోల్ బంకులో ఒక కారులో పెట్రోల్ నింపుతున్నట్లు చూడవచ్చు. ఇంతలో ఓ మహిళ అతని వద్దకు వచ్చి సిగరెట్ కావాలని అడిగింది. పెట్రోలు బంకు అయినందున ఆ వ్యక్తి సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన మహిళ కారులో పెట్రోల్‌ నింపుతుండగా లైటర్‌తో కారుకు నిప్పంటించి పారిపోయింది. కారులో మంటలు చెలరేగడంతో ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి పారిపోతూ కనిపించాడు. ఈ ఘటన ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో చోటుచేసుకుంది. దీంతో ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేయగా.. తాను ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టలేదని, ప్రమాదవశాత్తూ నిప్పు పెట్టానని వాంగ్మూలం ఇచ్చింది. ఫిబ్రవరి 16న షేర్ చేసిన ఈ వీడియోకు కోటి పైగా వ్యూస్, 38,000కు పైగా లైక్‌లు వచ్చాయి. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను నేరుగా జైలుకు పంపండి’’ అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. మరో వినియోగదారు కొంతమంది వ్యక్తుల్లో ఎంత క్రూరమైన మనస్తత్వం ఉంటుంది అని కామెంట్ చేయగా.. ఇది నిజంగా చెడ్డ ఆలోచన అని మరొకరు వ్యాఖ్యానించారు.