వామ్మో.. ఇంట్లోకి ప్రవేశించిన భారీ అనకొండ ఈ వీడియో చూస్తే భయపడిపోవడం పక్కా..! (వీడియో చూడండి)

జనం న్యూస్: పాము పేరు చెప్పగానే భయపడే వారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడతారు. అలాంటిది భారీ కొండచిలువను చూస్తే ఎలా ఉంటుంది. నేరుగా కాకుండా కొండచిలువ ఉన్న వీడియో చూసిన భయం వేస్తుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలోని భారీ కొండచిలువను చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. @AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది . వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ భారీ కొండ చిలువ కంచెను కూలగొట్టి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. అప్పటికే అది ఏదో జంతువును మింగేసినట్టు దాని ఉదర భాగం చాలా ఉబ్బెత్తుగా ఉంది. ఆహారం తిన్న వెంటనే కదలడానికి ఆ కొండచిలువ ఆపసోపాలు పడుతోంది. మెలికలు తిరిగిపోతోంది. అయితే గ్రామంలోకి ప్రవేశించిన ఆ కొండచిలువను పట్టుకోవడానికి గ్రామస్థులు ప్రయత్నించారు. దాని నోటిని తాడుతో కట్టేశారు. వారి నుంచి తప్పించుకున్న కొండ చిలువ ఓ కంచెను కూలగొట్టి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 54 లక్షల మందికి పైగా వీక్షించారు. 16 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఈ కొండచిలువ మొత్తం గ్రామాన్ని మింగేసినట్టు ఉంది``, ``దాని నోటిని కట్టిన వ్యక్తి ఎవరో చాలా ధైర్యవంతుడు``, ``అది ఏదో పెద్ద జంతువునే మింగేసింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.