మెట్రో రైలులో హద్దులు దాటిన యువతి..! దెబ్బకు పోలీసులకు సారీ చెప్పాల్సి వచ్చింది. (వీడియో చూడండి)
జనం న్యూస్: సోషల్ మీడియా పుణ్యమా అని అశ్లీల డ్యాన్స్ వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసే వాళ్లకు కొదవలేకుండా పోయింది.లైకులు, వ్యూస్ కోసం కొత్త కొత్త మార్గాలలో ఇది ఒకటి. అయితే, చాలా మంది బహిరంగ ప్రదేశాలు, రైలు, మెట్రో, పార్క్‌లలో అశ్లీల నృత్యాలు చేస్తూ..తోటి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అలాంటి వారిపై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వారిలో మార్పు రావటం లేదు. తరచూ ఏదో ఒక చోట ఇలాంటి డాన్సులు, రీల్స్ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. తాజాగా, ఢిల్లీ మెట్రోకు చెందిన ఇలాంటి డ్యాన్స్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో పోలీసులకు క్షమాపణలు చెప్పిన ఓ యువతి ఢిల్లీ మెట్రోలో మళ్లీ అశ్లీల నృత్యం చేసింది. వైరల్ వీడియోలో ఒక అమ్మాయి మెట్రోలో భోజ్‌పురి పాటపై డ్యాన్స్ చేస్తోంది. అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు అమ్మాయి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ వీడియో మహిళా కోచ్‌లో తీసినట్టుగా తెలుస్తోంది. మెట్రోలో జనాలు ఎవరూ లేరు. కాబట్టి ఈ అమ్మాయి మెట్రోలో భోజ్‌పురి పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియో చివర్లో ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తూ కనిపించింది. ఇంటర్నెట్లో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో జనాలు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మెట్రో అశ్లీల డెన్‌గా మారుతోందని సోషల్ మీడియా యూజర్ ఒక రాశారు. డిఎంఆర్సి ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పుడు నా కుటుంబంతో కలిసి ఢిల్లీ మెట్రోకు వెళ్లాలంటే భయంగా ఉందని ఒకరు రాశారు. మెట్రో ప్రయాణికులు స్వయంగా ముందుకు వచ్చి ఇలాంటి వారికి గుణపాఠం చెప్పాలని ఒకరు రాశారు. ఇలాంటి అమ్మాయిలను పట్టుకుని కనీసం ఒక రోజైనా జైల్లో ఉంచాలని, బహుశా అలా చేస్తేనే వారిలో మార్పు వస్తుందేమోనని అంటున్నారు. ఇది అమ్మాయి తప్పు కాదని, ప్రజలు మౌనంగా ఉన్నప్పుడు ఇలాంటి వారు ఏదైనా చేస్తారని మరొక యూజర్ రాసుకొచ్చారు. ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేస్తున్న ఈ అమ్మాయి పేరు మనీషా డాన్సర్. ఇటీవల, ముంబైలో కూడా ఇలాగే అశ్లీల డాన్స్ చేస్తూ హల్చల్ చేసింది. రైళ్లు, స్టేషన్లలో ఇదే పద్ధతిలో డ్యాన్స్ రీల్స్ చేస్తుండగా ముంబై RPF ఈ అమ్మాయిపై చర్య తీసుకుంది. దాంతో ఆమె వారిని క్షమాపణ కోరి తప్పించుకుంది. ఇప్పుడు, ఢిల్లీ మెట్రోలో అదే సీన్ రిపీట్ చేసింది. ఒకసారి పోలీసులకు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఈ అమ్మాయి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.