ఎంబిబిఎస్ సీట్లు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు సన్మానo
పిల్లలను అద్భుతంగా చదివించాలి.. కాంగ్రెస్ నాయకులు చందర్రావు
పిల్లలకు క్రమశిక్షణ చాలా అవసరం.. డాక్టర్ లక్కినేని రఘు
జనం న్యూస్ టుడే ; కల్లూరు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు లోని శాంతినగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు ఎంబిబిఎస్ సీట్లు సాధించిన నలుగురు విద్యార్థినీ విద్యార్థులకు శాంతినగర్ వాసులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుమర్తి చందర్రావు, డాక్టర్ లక్కినేని రఘు, గ్రామపంచాయతీ ఈవో నంది శెట్టి నాగేశ్వరరావు లు హాజరయ్యారు.
ముందుగా ఎంబిబిఎస్ సీట్లు సాధించిన విద్యార్థిని, విద్యార్థులు కొత్తపల్లి స్వరూప, తేల్లపుట్ట ఉదయ్ కిరణ్, నల్లగట్ల మహిత లను పుష్పగుచ్చమిచ్చి శాలువా కప్పి ఘనంగా కుటుంబ సమేతంగా సత్కరించారు.కార్యక్రమంలో భాగంగా డాక్టర్ లక్కినేని రఘు మాట్లాడుతూ ఎంబీబీఎస్ సీటు సాధించటం ఒకప్పుడు సాధ్యమయ్యే పని కాదని ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఎంబీబీఎస్ సీటు కొరకు చాలా కృషి చేస్తూ ఎంబీబీఎస్ సీటు సాధించటం గొప్ప విషయమని కొనియాడారు. కష్టం అనుకోకుండా ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా తెలిపారు.కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు మాట్లాడుతూ శాంతినగర్ లోని ఎంబిబిఎస్ సీట్లు సాధించటం గర్వించదగ్గ విషయమని పిల్లలు క్రమశిక్షణతో చదువుతూ శాంతినగర్కు ఎంబిబిఎస్ సీట్లు నాలుగు సాధించటం ఆనందంగా ఉందంటూ ముందు ముందు ఎమ్మెస్ లు ఎండిలు చేసి శాంతినగర్ కి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలంటూ కోరారు. శాంతినగర్ వాసులు ఉపాధ్యాయులు గుర్రాల సుధీర్ కుమార్ మాట్లాడుతూ నా చిన్నతనం నుండి శాంతినగర్లో నాలుగు ఎంబిబిఎస్ సీట్లు చూస్తానని నేను అనుకోలేదని, శాంతినగర్ కుటుంబాల్లో చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఎన్నో కుటుంబాలు ఉన్నాయని అయినా వాటిని లెక్కచేయకుండా వారి పిల్లలను ఎంతో గొప్పగా చదివిస్తూ క్రమశిక్షణతో ఉంచుతున్నారని, భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయిలో శాంతినగర్ వాసుల పిల్లలందరూ ఉండాలని కోరుకుంటున్నాము అని అన్నారు.అనంతరం కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ ఈవో నంది శెట్టి నాగేశ్వరరావు నీ శాంతినగర్ డెవలప్మెంట్ లో భాగంగా సమస్య ఉందని తెలియజేయడంతోనే వెంటనే స్పందించి శాంతినగర్ లోని పనులను వేగవంతంగా జరిపినందుకు శాంతినగర్ వాసులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఖమ్మంపాటి నాగేశ్వరరావు రిటైర్డ్ పంచాయతీ సెక్రెటరీ, ఖమ్మంపాటి వెంకటేశ్వర్లు (అబ్బాయి), కొత్తపల్లి వెంకటేశ్వర్లు కె.వి ఎస్డిఎస్ ఉపాధ్యక్షులు , కొండూరి కిరణ్ కుమార్ ఎక్స్ ఎంపీటీసీ, ఖమ్మంపాటి వీరస్వామి శాంతినగర్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు మాజీ వార్డు సభ్యులు, వెంగళ పెంటయ్య , గుర్రాల సత్యానందం ఫాస్టర్, కనకపుడి జయరాజు ఎస్ డి ఎస్ కోశాధికారి, ఉపాధ్యాయులు గుర్రాల సుధీర్ కుమార్, సంగెపు రామకృష్ణ విలేఖరి, ఖమ్మంపాటి శ్రీనివాసరావు ఎస్ డి ఎస్ ప్రధాన కార్యదర్శి, అనిల్ అద్దంకి, మతిపోగు రాము, మోదుగు రమేష్, కొత్తపల్లి వీరేందర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.