ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులో నిందితునికి 10 సం.లు జైలు, జరిమానా
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్.
జనం న్యూస్ 05 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసు స్టేషనులో 2019 సంవత్సరంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుడైన నెల్లిమర్ల మండలం ఎ.టి. అగ్రహారానికి చెందిన నారు అప్పల నాయుడు (33 సం.లు)కు ఎస్సీ మరియు ఎస్సీ కోర్టు ఇన్చార్జ్ విజయనగరం పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి శ్రీమతి కె.నాగమణి గారు 10 సం.లు జైలుశిక్ష మరియు రూ.9,000/-లు జరిమాన విధిస్తూ అక్టోబరు 4న తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లిమర్ల మండలం ఎటి అగ్రహారంకు చెందిన నారు అప్పల నాయుడు (33సం.లు) అనే వ్యక్తికి కాంపీటీటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో బొండపల్లి మండలానికి చెందిన ఒకామెతో పరిచయం ఏర్పడి, ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను శారీరకంగా లోబర్చుకొని, పెండ్లికి నిరాకరించడంతో, ఆమె బొండపల్లి పోలీసు స్టేషనులో తే. 28-02-2019 దిన ఫిర్యాదు చెయ్యగా, బొండపల్లి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, అప్పటి ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీ చౌదరి పాపారావు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.
నిందితుడు నారు అప్పల నాయుడుపై నేరం రుజువు కావడంతో విజయనగరం ఎస్సీ మరియు ఎస్సీ కోర్టు ఇన్చార్జ్ విజయనగరం పోక్సో కోర్టు జడ్జి శ్రీమతి కే. నాగమణి 10 సం||లు జైళు శిక్ష మరియు రూ.9000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటరు జయలక్ష్మి వాదనలు వినిపించగా, ప్రస్తుత బొండపల్లి ఎస్ఐ యు. మహేష్, గజపతినగరం సిఐ జి.ఎ.వి.రమణ పర్యవేక్షణలో కోర్టు హెడ్ కానిస్టేబులు ఎం.ప్రకాష్ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారన్నారు. కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్షపడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను, కోర్టు లైజన్ ఆఫీసరు ఎ.విజయకుమార్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ అభినందించారు.