ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు: ఉత్తమ ఉపాధ్యాయునిగా వినయ్

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు: ఉత్తమ ఉపాధ్యాయునిగా వినయ్

జనం న్యూస్ సెప్టెంబర్ 5 నల్గొండ: నల్గొండ జిల్లా ఇన్చార్జి ముత్యాల సురేష్; నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన వినయ్ ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందారు. ఒక మనిషిని తీర్చిదిద్దడంలో ఒక సమాజాన్ని తయారు చేయడంలో ఉపాధ్యాయినీ పాత్ర ఎంతో ముఖ్యమైనదని ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఒక స్కూల్ టీచర్ కావడం అనేది మన దేశంలో ఉన్న టీచర్లు అందరికీ చాలా గొప్ప గర్వకారణం. ఉత్తమ ఉపాధ్యాయునిగా నల్గొండ జిల్లా ఆమనగల్లు గ్రామానికి చెందిన వినయ్ సారు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది అని సన్మానంలో భాగంగా నల్గొండ జిల్లా ఎంపీ రఘువీర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , నల్గొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఉపాధ్యాయుడు గురించి చాలా గొప్పగా వివరించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వినయ్ సార్ మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు. ఉత్తమ అవార్డు ఉపాధ్యాయ గ్రహీత అనేది చాలా గొప్ప విషయమని మంత్రి అన్నారు. సాధారణంగా పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా ఉపాధ్యాయుల దగ్గర ఎక్కువ కాలాన్ని గడుపుతారని మంత్రి, ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షుడు అన్నారు.