ఘోరం.. వేగంగా వెళ్తున్న బస్సు నుంచి కింద పడిపోయిన మహిళ..పాపం.. (వీడియో చూడండి)

జనం న్యూస్: తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసింది. ఒక బస్సు షార్ప్ టర్న్ తీసుకోవడం వల్ల ఒక మహిళ బస్సు నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ పుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. బస్సులో శారద అనే ఒక మహిళ ఎక్కింది. ఆమె బస్సు డోర్ దగ్గర నిలబడి ఉంది.బస్సు ఒక టర్నింగ్ తీసుకున్నప్పుడు, ఆమె బ్యాలెన్స్ కోల్పోయి బస్సు నుంచి బయటకు ఎగురుతూ దాదాపు 20 అడుగుల దూరంలో రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనను చూసిన ఇతర ప్రయాణికులు హడవిడిగా బస్సు కండక్టర్‌కు తెలియజేశారు.దీంతో బస్సు డ్రైవర్ బస్సును ఆపివేశాడు.గాయపడిన శారదను వెంటనే సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె సేలంకు వెళ్లి బట్టలు కొని బస్సులో తిరిగి ఇంటికి వస్తున్నట్లు తెలుస్తోంది.