చిన్నోనిపల్లి రిజర్వాయర్ పైన అవగాహన లేని నాయకుడు ఆరోపణ చేస్తే విడ్డూరంగా ఉంది.

చిన్నోనిపల్లి రిజర్వాయర్ పైన అవగాహన లేని నాయకుడు  ఆరోపణ చేస్తే విడ్డూరంగా ఉంది.

జనం న్యూస్ 22 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 

 గద్వాలలో కొత్త కొత్త టూరిస్టు నాయకులు....రిజర్వాయర్ల పైన గద్వాల నియోజకవర్గం పైన అవగాహన లేని నాయకుడు ఆరోపణ చేయడం ఇకనైనా మానుకోండి తస్మా జాగ్రత్త .....ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు గారు గట్టు మండల మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ గారు  నిర్వహించిన *ప్రెస్ మీట్ లో సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీపీ విజయ్ గారు మాట్లాడుతూ....గద్వాల నియోజకవర్గం లో కొత్త కొత్త నాయకులు గద్వాల నియోజకవర్గం పైన గద్వాలలోని గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ పైన ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు చిన్నోనిపల్లి రిజర్వాయర్ల పై తప్పుడు ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ⚡చిన్నోనిపల్లి రిజర్వాయర్ 2005 సంవత్సరంలో  నెట్టెంపాడు ప్రాజెక్టు భాగంగా చిన్నంపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేయడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాములో అప్పటి శాసన సభ్యురాలు డీకే అరుణ మ్మ గారి ఆధ్వర్యంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్మాణం పనులు ప్రారంభం కావడం చిన్నోని పల్లి  రిజర్వాయి పైన ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని సూచించారు.⚡రిజర్వాయర్లో మొత్తం ఐదు గ్రామాల కలిపి 2400 ఎకరాలక పట్టా భూములకు 2006. 07 సంవత్సరంలోనే  భూపరిహారం వచ్చింది అందులో ఇంకా ప్రభుత్వ అసైన్మెంట్ భూమి దాదాపు130 ఎకరాల భూమి రిజర్వాయర్లో ముప్పున గురైంది ఇప్పటివరకు కోర్టు ద్వారా 68 ఎకరాలకు భూ పరిహారం రావడం జరిగింది  62 ఎకరాలకు పరిహారం రావలసి ఉన్నది దానికే 244  ఎకరాలకు  అవార్డు సిద్ధమైందని అనవసరమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమన్నసం ఇటువంటి అన్ని తప్పుడు ఆరోపణలు చేయడం సమన్యసం కాదు భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు చేయకుండా ఉండాలని సూచించారు  ఈ విషయాలపై అక్కడ జరిగిన సంఘటనపై ఎలాంటి అవగాహన లేకుండా 244 ఎకరాలకు అవార్డులు సిద్ధమయ్యాయని తప్పుడు ఆరోటణం చేయడమే కాకుండా ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.


 ⚡నీ రాజకీయ లబ్ధి కోసం అమాయకులైన చిన్నోనిపల్లి రైతులను వాడుకోవడం సరైనది కాదు చిన్నోనిపల్లి రైతులను గత పది సంవత్సరాలుగా వివిధ రకాల నాయకులు రకరకాల వేషాలతో చిన్నోనిపల్లి రైతులను వాడుకొని వారి రాజకీయ లబ్ధి కోసం వారి జీవితాలను ఆగం పట్టించడం సరైనది కాదు ఇకనైనా మీ రాజకీయ లబ్ధి కోసం అమాయకులైన రైతులను వాడుకోవడం మానుకోండి ఏదైనా ఉంటే ప్రజల మన్నెల పొందాలంటే ప్రజలకు మేలు జరిగే పనులను చేసి ప్రజలకు ప్రజల మందనను పొంది వారికి అండగా నిలవండి అప్పుడే నిజమైన రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ప్రజలు కూడా అవకాశం కల్పిస్తారు ఇలా కాకుండా తప్పుడు ఆరోపణ చేస్తూ ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ లేని లేని మాయ మాటలు చెప్పి అమాయకమైన ప్రజలను తప్పుడు ఆరోపణలు చేసే విధంగా ఎలాంటి సంబంధం లేని మంత్రి గారు పైన ఎమ్మెల్యే గారి పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ వారిని నిందించడం సరైన పద్ధతి కాదని సూచించారు. ⚡244 ఎకరాలు కాదు కేవలం నాలుగు ఎకరాలైన అవార్డు పొందారని నిరూపిస్తే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ⚡ గతంలో అకాల వర్షంలో పడినప్పుడు గ్రామంలోకి నీరు వచ్చినప్పుడు చిన్నోనిపల్లి గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఆనాడు ఇప్పుడు మాట్లాడే నాయకుడు ఆ నాయకుడు క ఆ గ్రామం వైపు చూడలేదు ఎమ్మెల్యే గారు నా ప్రాంతంలో నా నియోజకవర్గ ప్రజలు అని వారికి అండగా నిలిచారు అధికారులతో మాట్లాడి చిన్నోనిపల్లి నిర్వాహసలకు ఆర్andఆర్ సెంటర్ లోను  అన్నిమౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటుచేసి వారికి వెన్నంటుగా ఉంది ప్రతి ఒక్క రైతును కాపాడుకుంటానని చెప్పి కలెక్టర్ గారితో ఆర్డీవో గారితో ఇతర అధికారులతో మాట్లాడి తక్షణ చిన్నోనిపల్లి గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆర్ అండ్ ఆర్ సెంటర్లో తాగునీరు సౌకర్యం, విద్యుత్ సరఫరా, అందించి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అండగా నిలిచిన నాయకుడు మా ఎమ్మెల్యే గారిని పేర్కొన్నారు.⚡ గద్వాల నియోజకవర్గం పైన గాని గట్టు మండలం చిన్నోని పల్లి పైన గాని ఎలాంటి అవగాహన లేని టూరిస్ట్ నాయకుడివి నువ్వు గద్వాల నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు మేము చిన్నోనిపల్లి  గ్రామస్తుల పరిస్థితుల గురించి అంత అవగాహన ఉన్న వ్యక్తులం అందుకోసం చిన్నోనిపల్లి గ్రామంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ నుంచి రావాల్సిన నష్టపరిహారాలు వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని కూడా పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని చిన్నోనిపల్లి  ఆర్andఆర్ సెంటర్లో నిర్వాసితులకు అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది త్వరలో కూడా వారికి కూడా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత మాది మా ఎమ్మెల్యే గారి ని తెలిపారు. ఇకనైనా మానుకో నీ రాజకీయ లబ్ధి కోసం అమాయకులైన రైతులతో అడ్డం పెట్టుకొని రాజకీయ ఎదగాలని ఆలోచన మానుకో ఖబర్దార్ అని హెచ్చరించారు. జిల్లా గ్రంధాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు మాట్లాడుతూ ....చిన్నోనిపల్లి రిజర్వాయర్ పైన ఎమ్మెల్యే గారి పైన తప్పుడు ఆరోపణ చేయడం సరైన పద్ధతి కాదు చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి నిర్మాణమైన చిన్నోనిపల్లి  రిజర్వాయర్లో ఎన్ని ప్రభుత్వ భూములు రైతులకు ఇవ్వడం జరిగిందో తెలుసా. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి పైన చిన్ననిపల్లి రిజర్వాయర్ పైన తప్పుడు ఆరోపణ చేయడం సరైనది కాదు అని సూచించారు. చిన్ననపల్లి భూసేకరణలో ఎమ్మెల్యే గారు డబ్బులు తీసుకున్నారని తప్పుడు ఆరోపణ చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు ఎక్కడైనా ఎమ్మెల్యే గారు ఏ ఒకరితో అయినా డబ్బులు తీసుకున్నారని నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని హెచ్చరించారు. ఎమ్మెల్యే గారు తాను పార్టీ మారింది తన సొంత లాభం కోసం కాదు గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం గద్వాల నియోజకవర్గం ప్రజల క్షేమం కోసం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గద్వాల ప్రాంతాన్ని మరింత అభివృద్ధి వైపుగా తీసుకువెళ్లాలని దృష్టితో దూర దృష్టి ఆలోచనతో ఎమ్మెల్యే గారు పార్టీ మారడం జరిగింది . బిడ్డ ఖబర్దార్ ఇకనైనా నీ వేషాలు మానుకో లేకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని హెచ్చరించారు.????ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు ముని చంద్ర గౌడ్ యు శ్రీనివాసులు హనుమంత్ రెడ్డి వాగుబాయి వీరన్న  దాసరి బజారి  అంతంపల్లి   మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ భూ నిర్వాసిత రైతులు చిన్న భీమన్న సామేలు మధుకర్  వీరేషు శేషన్న తదితరులు పాల్గొన్నారు.