చీ.. చీ.. ఇదేం దరిద్రం రా సామీ.. డైరీమిల్క్ తో పకోడీ అంట మీరు కూడా చూడండి...

చీ.. చీ.. ఇదేం దరిద్రం రా సామీ.. డైరీమిల్క్ తో పకోడీ అంట మీరు కూడా చూడండి...

జనం న్యూస్: ఇప్పటి వరకు మనం అనేక రుచులను చూసుంటాం. కానీ డైరీమిల్క్ చాక్లెట్‌తో పకోడీ టేస్ట్ మాత్రం చూసుండం. అంతెందుకు చాలా మందికి అసలు డైరీమిల్క్ చాక్లెట్‌తో పకోడీ ఎలా చేస్తారో కూడా తెలియదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఫన్నీ కామెంట్లతో రిప్లై ఇస్తున్నారు. ఇప్పటికే మనం నూడుల్స్‌తో రకరకాల వంటకాలు, మనకు తెలియని వెరైటీ వంటకాలు చేయడం గురించి విన్నాం.. చూశాం.. ఈ డైరీమిల్క్ పకోడీ కొత్తగా ఉండటంతో అంతా వీడియోని చూస్తున్నారు.

కింద లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి.

https://www.instagram.com/reel/Ci-Ti7kprJE/?igshid=YmMyMTA2M2Y=

రోడ్డు పక్కన బండి పెట్టుకున్న ఒక మహిళ డైరీమిల్క్ చాక్లెట్‌ను తీసుకుని పకోడీల కోసం కలిపిన పిండిలో ముంచి.. పిండితో పాటుగా.. వేడిగా ఉన్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసింది. తర్వాత ఒక గరిటెతో ఆ చాక్లెట్ పకోడీలను బయటకు తీసింది. వాటి మీద కొంచెం మసాలా, కొంత గ్రీన్ చట్నీ వేసి ఇద్దరు కస్టమర్లకు సర్వ్ చేసింది. ఈ పకోడీలను తీసుకున్న కస్టమర్లు లొట్టలేసుకుంటూ తిన్నారు. వారు ఇచ్చిన హావభావాలను బట్టీ.. ఇవి వారికి బాగా నచ్చాయనిపిస్తోంది.