డ్రగ్స్ ను నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడుకుందాం
జనం న్యూస్ 27 సెప్టెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
పలుచోట్ల ఎస్ఎఫ్ఐ ఫ్లాష్ మాబ్స్ ప్రదర్శన
విజయనగరంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫ్లాష్ మాబ్ డ్రగ్స్ ని నిర్మూలిద్దాం భవిష్యత్తు ను కాపాడుకుందాం ఈ నెల 28, 29, 30 తేదీలలో జరగబోయే భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ నీ జయప్రదం చేయండి. ఎస్ ఎఫ్ ఐ మత్తు పదార్థాల్ని నిర్మూలించాలి అనే అంశంపై అవగాహన కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ ఐ విజయనగరం నగర కమిటీ ఆధ్వర్యంలో తోటపాలెం , కాంప్లెక్స్ , రైల్వే స్టేషన్ వద్ద ఫ్లాష్ మాబ్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు కళాశాల నుండి వచ్చిన విద్యార్థి బృందాలు పలు సినిమా పాటలకు నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు J రవికుమార్ మాట్లడుతూ జిల్లాలో రోజురోజుకీ పెరిగిపోతున్న డ్రగ్స్ మత్తు పదార్థాలను నిర్మూలించాలని కోరుతూ ఎస్ఎఫ్ఎ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుందని దానిలో భాగంగా ఈనెల 28 29 30 తేదీలలో విజయనగరంలో గల
గురజాడ కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటి ప్రచార నిమిత్తం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దానిలో భాగంగానే నేడు విజయనగరంలో ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్ కు స్పందన బాగా వచ్చిందని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇదే సందర్భంలో స్త్రీలపై జరుగుతున్న దాడులను వారు ఖండించారు. ఒక యువతి తాను ఎక్కడికి వెళ్లినా, ఏ బట్టలు ధరించిన, తాను కాదు అంటే కాదు అని, అవును అంటే అవును అనే విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు. తల్లిదండ్రులు తమ కూతుర్లకు ఎలాగైతే జాగ్రత్తలు చెప్తారో అదే విధంగా తమ కుమారులకు కూడా సాటి స్త్రీలపై, బాలికలపై ఎలా మెలగాలో నేర్పించాలని అప్పుడే మార్పు వస్తుందని తెలిపారు. ఈ రెండు అంశాలపై ఎస్ఎఫ్ఎ నిర్వహిస్తున్న భగత్ సింగ్ స్టూడెంట్స్ ఫెస్ట్ ని విద్యార్థులు, ప్రజలు, మేధావులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు , ఎస్ సమీరా, ఎం రమేష్ , రాజు , సుస్మిత , రమణ , చరణ్ పాల్గొన్నారు.