తెలంగాణ విద్రోహ దినం సదస్సు ; న్యూడెమోక్రసీ
జనం న్యూస్ సెప్టెంబర్ 17 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) సెప్టెంబర్ 17 పురస్కరించుకొని ఆలేరు పట్టణంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో తెలంగాణ విద్రోహ దినo సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్ మాట్లాడుతూ చరిత్రను వక్రీకరిస్టు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న మోడీ ప్రభుత్వంఅని సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహమే అని ఆరోపించారు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను చరిత్ర ఆనవాళ్లను లేకుండా చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటూ విలీనం విమోచన అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు నాటి నిజాం నవాబుతో కుమ్మక్కై నెహ్రూ సైన్యం బల వంతంగా సాయుధ పోరాటాన్ని అణిచి వేసింది ఫలితంగా తెలంగాణ ప్రాంతానీ కీ ద్రోహాన్ని తలపెట్టిందని అన్నారు తెలంగాణ ప్రజలు సాధించుకున్న హక్కులు మా న ప్రాణాలను హరించి వేసిన రోజు సెప్టెంబర్ 17 ముమ్మాటికి వి ద్రోహ దినమే అని అన్నారు పోరాటాల చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి మతోన్మాద ఫాసిస్టు విధానాలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజలు విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతున్నారని సాధించుకున్న తెలంగాణలో విద్యా ఉపాధి అవకాశాలపై ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర భవిష్యత్ తరాలకు అందించాలని చరిత్రను వక్రీకరిస్తే భవిష్యత్తు ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కళ్లెపు అడవయ్య ,ఇ క్కిరి శ్రీనివాస్, మాలోతు మోతిలాల్ శిఖలం కుమారస్వామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు