నడి బజారులో అందరిముందు హద్దులు దాటి చిల్లర వేషాలు వేసిన లవర్స్ (వీడియో చూడండి)

జనం న్యూస్: ప్రేమలో మునిగి తేలిపోయిన అమ్మాయికి, అబ్బాయికి మరో ప్రపంచం ఉండదు. ప్రేమ మైకంలో మునిగి తేలుతుంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పొద్దుపోయే వరకు సెల్ ఫోనులో ముచ్చట్లతో సరిపెట్టేస్తారు. ఇక వీలు కుదిరినప్పుడల్లా కలుసుకుని..ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. సినిమాలు, షికార్లులతో సరిపెట్టుకోవడమే కాకుండా షాపింగ్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఒకరి ఇష్టాలు మరొకరు పంచుకుంటూ ఉంటారు. అయితే ప్రేమ ఉన్న చోట అనుమానం కూడా దాగి ఉంటుంది. తన లవర్ మరొకరితో స్నేహంగా ఉన్నా, ఎక్కువ సేపు ఫోనులో మాట్లాడినా లేదంటే.. ఆన్ లైన్ చాట్‌లో కనిపించినా.. తట్టుకోలేరు. దీనిపై అస్తమాను గొడవపడుతుంటారు. ఈ అనుమానం పెనుభూతంగా మారి ప్రేమలు బ్రేకప్ అవుతూ ఉంటాయి. అయితే ప్రేమలో చిలిపి తగాదాలు, చిన్నిచిన్ని తగాదాలు కామన్. ఇదిగో తాజాగా ఓ ప్రియుడు, ప్రియురాలు మొబైల్ విషయంలో గొడవ పడ్డారు. ప్రియురాలి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొనేందుకు ప్రియుడు ప్రయత్నించగా.. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రయత్నించింది ప్రియురాలు. ఎవరో ఈ చిలిపి ఘరర్షణను వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతుంది. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీలో చోటుచేసుకుంది. హుబ్లీలోని కొప్పికరా రోడ్డులోని మాల్ సమీపంలో చోటుచేసుకుంది. జోరున వర్షం పడుతుండగా.. ఇద్దరు లవర్స్ రోడ్డు పక్కన నిలబడ్డారు. అంతలో ఏమైందో తెలియదు కానీ.. ప్రియురాలి చేతిలో ఉన్న ఫోనును లాక్కొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు ప్రియుడు. రేమాండ్ షోరూమ్ దగ్గర ఈ ఘర్షణ జరిగింది. అయితే వీడియోలో ఆమె చున్నీని మెడకు పట్టి.. మొబైల్ ఇస్తావా లేదా అంటూ ప్రశ్నించాడు లవర్. ఆమె ససేమీరా ఇచ్చేందుకు నిరాకరించింది. పలుసార్లు ప్రయత్నించి విపలమయ్యాడు లవర్. చివరకు అటుగా వెళ్లిన వాళ్లు.. యువతిపై అబ్బాయి దాడి చేయడంపై జోక్యం చేసుకున్నారు. అయితే మొబైల్ ఫోను విషయంపై ఇద్దరు గొడవపడ్డారని తెలుస్తుంది. ఇద్దరం రోడ్డుమీద ఉన్నామని, జనాలు చూస్తున్నారన్న విషయం మరిచిపోయి మరీ తన్నుకోవడం గమనార్హం. తాము నడిరోడ్డుపై ఉన్నామన్నా సోయ కూడా లేదు ఇద్దరికీ. అక్కడ కొంత మంది వీరి తగాదాపై జోక్యం చేసుకున్నారు. అయితే జనాలు అడగటానికి వెళితే.. మా మధ్య మీరెందుకు వచ్చారు అంటూ ప్రశ్నించాడు లవర్. అతడ్ని పట్టుకుని నిలదీయడంతో ఈ ఘర్షణ సద్దుమణిగింది.