చీ..చీ.. వీల్లేమి పిల్లలురా సామీ..పురుగులను తింటున్నారు..! వీడియో చూస్తే విస్తుపోతారు...

జనం న్యూస్: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. సోషల్ మీడియా అంటేనే వింతలు, విచిత్రమైన వార్తలు, సంఘటనలతో నిండిపోయి ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి వీడియోలు చూసిన నెటిజన్లు కూడా షాక్‌ అవుతుంటారు. ప్రతిరోజూ వేలాది వీడియోలు ఇక్కడ పోస్ట్‌ చేస్తుంటారు. అవి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన వినియోగదారుల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒకింత షాక్‌ అయ్యేలా కూడా చేస్తుందనే చెప్పాలి. మనం ఎప్పుడైన మనం తింటున్న ఆహారంలో ఏదైనా చిన్న పరుగులాంటిది కనిపిస్తే ఇక అంతే.. ఆ ఫుడ్ తినటానికి భయపడిపోతాం. వాక్ చీ అంటూ చిదరించుకుని పక్కన పడేస్తుంటాం. అలాంటి పురుగులు పడిన ఆహారం తింటే రోగాల బారిన పడాల్సి వస్తుందని ఆందోళనపడిపోతుంటాం.. కానీ, ఇక్కడ ఇద్దరు చిన్నారులు మాత్రం ఏకంగా బతికున్న పురుగుల్ని ఏరుకుని అమాంతంగా తినేస్తున్నారు. ఈ వీడియో చూస్తే ఒళ్లు గగ్గర్పాటుకు గురికాక తప్పదు.. వీడియోలోకి వెళితే.. వైరల్‌గా మారిన వీడియోలో ఒక అక్కా తమ్ముడు ఒక పొలంలో కూర్చుని కనిపిస్తున్నారు.. ఆ సమయంలో పొలంలో ఒకే చోట అనేక కీటకాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో పొలంలో కూర్చున్న ఇద్దరు పిల్లలు ఆ కీటకాలను పట్టుకుని తింటున్నారు. ఇది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరు పిల్లలు మాత్రం బతికి ఉన్న కీటకాలను సజీవంగానే ఎంతో ఆసక్తిగా తింటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ చిన్నారుల ముఖాలను బట్టి వారు జపాన్ వాసులుగా భావిస్తున్నారు. వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్‌ చేస్తున్నారు. పరుగులు తినేంత కష్టం మీకేం వచ్చిందంటూ మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.