నడి రోడ్డుపై కస్టమర్ గొంతుకోసిన వ్యక్తి.. వీడియోలు తీస్తూ చూస్తున్న ప్రజలు (వీడియో చూడండి)

జనం న్యూస్: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన షాకింగ్ సంఘటనలో, రద్దీగా ఉండే రహదారిపై మోమోస్ విక్రేత ఒక వ్యక్తి గొంతు కోసాడు. ఈ ఆందోళన కలిగించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, ప్రజలు ఈ దాడిని మూగ ప్రేక్షకులుగా చూస్తూ నిలబడ్డారు కానీ ఆపడానికి ఎవరు ప్రయత్నం కూడా చేయలేదు. అందరూ చూస్తుండగానే మోమోస్ అమ్మే వ్యక్తి ఇంకో వ్యక్తి మెడ పట్టుకుని కనికరం లేకుండా గొంతు కోయడం వీడియోలో రికార్డు అయ్యి ఉంది. ఈ వీడియోపై పోలీసులు స్పందిస్తూ.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.