నిరుపేద ప్రజలకు వరం సీఎంఆర్ఎఫ్ నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునితాలక్ష్మారెడ్డి....
దివ్యభారతి 60,000 నరేష్ 28,500 చెక్కులను తాజా మాజీ సర్పంచ్ ఏనుగు అశోక్ రెడ్డి కి అందజేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి..,
జనం న్యూస్ నవంబర్21.24 శివంపేట మండలం మెదక్ జిల్లా ప్రజలకు నిరుపేదలకు వైద్య సహాయం కోసం ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు.గురువారం సునీత లక్ష్మారెడ్డి శివంపేటమండలం గోమారం తన నివాసంలో నవాబ్ పేట గ్రామానికి చెందిన సీ.దివ్య భారతికి మంజూరైన 60,000 అరవైవేల రూపాయల చెక్కును అదే గ్రామానికి చెందిన సీ.హెచ్.నరేష్ కి మంజూరైన 28,500ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చెక్కును తాజా మాజీ సర్పంచ్ ఏనుగు అశోక్ రెడ్డికి అందజేశారు, కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నయీం ఉద్దీన్, సత్యం గౌడ్ ,షేక్ హుస్సేన్,గూడూరు యాధా గౌడ్, మర్రి మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు