న్యూడ్ ఫోటోలు పంపితే మచ్చలు చూసి జాతకాన్ని మార్చేస్తాం... హైదరాబాదులో దారుణం 200 మంది మహిళలకు పైగా..
జనం న్యూస్: పుట్టుమచ్చలు, హస్తరేఖలతో జతకాలు మార్చేస్తామని చెప్పగానే నమ్మేశారు.. కేటుగాళ్లు చెప్పిందల్లా చేసేశారు.. వారి క్రైమ్ సెన్స్ తెలియని అమాయక మహిళలు ఏకంగా న్యూడ్ కాల్స్ చేసేశారు. ఆ కీచకుల చేతికి ఏవైతే చిక్కకూడదో అవే చిక్కాయి. ఇంకేముంది.. రెచ్చిపోయారు. బెదిరింపులకు పాల్పడ్డారు. బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. ఓ బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. విచారణలో విస్తుగొలిపే నిజాలు బయటకొచ్చారు. ఈ దుర్మార్గులు.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా రెండు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అనేక మంది మహిళలను ఇలా బురిడి కొట్టించారు. ఉన్నది ఉన్నట్లు చెబుతామంటూ ఊదరగొడతారు.. ఇంట్లోంచి, ఒంట్లోంచి దోషాలను తొలగిస్తామంటూ నమ్మిస్తారు. నమ్మిస్తూ మన పర్సనల్ లైఫ్‌లోకి తొంగి చూస్తారు. అనుకున్న పని పూర్తి అవగానే.. అసలు రంగు బయటపెడతారు ఈ కేటుగాళ్లు. ప్రజల అమాయకత్వమే వారికి ఆసరా.. ప్రజల అవసరాలే వారికి ఆయుధాలు.. వాటిని అందిపుచ్చుకునే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయారు. మహిళల అమయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. హస్తరేఖలు, పుట్టుమచ్చలను చూసి జాతకాలు చెబుతామంటూ వచ్చారు. మీరు కోరినట్లుగా జాతకాలనే మార్చేస్తామని నమ్మబలికారు. ఆ పిచ్చి తల్లులు వారి చెప్పింది నమ్మేసి.. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని కోడుపర్తి, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా ఆమన్‌గల్ లో కొందరు కేటుగాళ్లు.. జ్యోతిష్యం పేరుతో జ్యోతిష్య కేంద్రాలు ఓపెన్ చేశారు. హస్త రేఖలు, పుట్టు మచ్చలు చూసి జ్యోతిష్యం చెబుతామంటూ నమ్మబలికారు. తమ వద్దకు వస్తే మంచి జరుగుతుందని విపరీతంగా ప్రచారం చేశారు. సామాన్యులనే వారు టార్గెట్ చేసుకున్నారు. పుట్టుమచ్చలు చూసి జ్యోతిష్యం చెబుతామని, అవసరమైతే జాతకాలనే మార్చేస్తామంటూ ఊదరగొట్టారు. శరీరంపై పుట్టుమచ్చలకు సంబంధించిన ఫోటోలు తమకు పంపిస్తే.. వాటిని పైకి పంపిస్తామని, అక్కడ పెద్దలు అమ్మవారికి పూజలు చేస్తారంటూ నమ్మించారు. పూజలుు చేసిన తరువాత వారికి పూనకం వస్తుందని, ఆ తరువాత సదరు వ్యక్తుల ఇంట్లో సంపద పెరుగుతుందని చెప్పారు.ఇంకేముంది.. ఈ మాయగాళ్ల మాటలు నమ్మిన చాలామంది మహిళలు.. తమ న్యూడ్ ఫోటోలను సైతం పంపించేశారు. వీరిలో ఎక్కువమంది మహిళలు ఉండగా.. పురుషులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, బాధితుల న్యూడ్ ఫోటోలు చేతికి అందడమే ఆలస్యం.. కేటుగాళ్లు తమ అసలు బుద్ధిని బయటపెట్టారు. బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. వీరి బ్లాక్‌మెయిల్‌కి విసిగిపోయిన ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టగా జ్యోతిష్యం మాటున కేటుగాళ్లు సాగిస్తున్న కీచకపర్వం వెలుగుచూసింది. నిందితులైన జైనుద్దీన్, రాములు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా ఈ ముఠాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.