పెళ్లి వేధికపైనే వరుడిని చావబాధిన పెళ్ళికూతురి ప్రియుడు వీడియో చూస్తే షాక్ అవుతారు..!

జనం న్యూస్: ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీటలు ఎక్కాలని లేదు. వివిధ కారణాలతో చాలామంది మధ్యలోనే విడిపోతున్నారు. కొందరు పరిస్థితుల ప్రభావంతో బ్రేకప్ చెప్పుకుంటారు. అయితే ప్రేమించిన వారికి ఇతరులతో పెళ్లి జరిగితే, అవతలి వ్యక్తి బాధ వర్ణించలేం. ఈ పరిస్థితిని ఒక్కొక్కరు ఒక్కోలా డీల్‌ చేస్తారు. కానీ రాజస్థాన్‌లో ఓ వ్యక్తి మాత్రం, తన ఎక్స్ లవర్‌ వేరొకరిని పెళ్లి చేసుకోవడం చూసి హర్ట్ అయ్యాడు. దీంతో పెళ్లి వేదికపైనే వరుడిపై దాడిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వెంటనే చాలా మంది నెటిజన్లకు షాహిద్ కపూర్ హిట్ మూవీ ‘కబీర్ సింగ్’ గుర్తుకు వచ్చింది. ఇది తెలుగు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్. ఈ వీడియోలో పెళ్లి కూతురి ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌, పెళ్లి కొడుకుని పదే పదే కొట్టడం కనిపించింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భిల్వారాలో జరిగింది. దాడి జరుగుతుందని ముందు ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే నవదంపతులతో ఫొటో దిగేందుకు వధువు మాజీ ప్రియుడు వేదికపైకి వెళ్లాడు. అకస్మాత్తుగా వరుడిపై దాడి చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు. ఈ ఘటన జరిగిన తేదీ గురించి స్పష్టత లేదు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ‘ఘర్ కే కలేష్’ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. ‘రాజస్థాన్‌లోని భిల్వారాలో వివాహ వేదికపై మాజీ ప్రియుడు, వరుడి మధ్య ‘కబీర్ సింగ్’ సినిమా లాంటి ఫైటింగ్ జరిగింది. మాజీ ప్రియుడు, వధువు ఇద్దరూ ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులు.’ అని వీడియో క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

వరుడు ఏం తప్పు చేశాడు?

కామెంట్‌ సెక్షన్‌లో చాలా మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ఈసారి గెస్ట్‌ లిస్ట్‌ సరిగ్గా చెక్‌ చేయడం, రెండు వైపుల వారికీ మంచిది.’ అని ఒక యూజర్ కామెంట్‌ చేశాడు. ‘ఇది అబ్బాయి తప్పు అని అందరూ చెబుతారు, కానీ అమ్మాయి ఇద్దరితో డబుల్ గేమ్‌ ఆడుంటే?’ అని మరొక నెటిజన్‌ ప్రశ్నించాడు. ‘అతనికి ఏమైంది? ఆ వరుడు చేసిన తప్పేంటి? కబీర్ సింగ్‌గా పేర్కొంటున్న ఆ వ్యక్తికి దండా వాలా చికిత్స ట్రీట్‌మెంట్‌ తప్పదు.’ అని ఇంకో యూజర్‌ చెప్పాడు. ఇంకొకరు వధువును తప్పుబట్టారు. ‘క్రైమ్ పెట్రోలింగ్ ఎపిసోడ్. నేరస్థుడు, సూత్రధారి వధువు అవుతుంది.’ అని కామెంట్‌లో పేర్కొన్నాడు.