ఇంట్లోకి దూరిన 13 అడుగుల కొండనాగు పాము.. ఆ తరువాత..? విస్తుపోయే నిజాలు..

ఇంట్లోకి దూరిన 13 అడుగుల కొండనాగు పాము.. ఆ తరువాత..? విస్తుపోయే నిజాలు..

జనం న్యూస్: ఓ పాము.. ఆ ఊరు ఊరంతా కలకలం రేపింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం జాకేరులో కింగ్ కోబ్రా గ్రామస్థులను టెన్షన్ పెట్టింది. మునుపెన్నడు చూడని భారీ కింగ్ కోబ్రాను చూసి అందరికీ వెన్నులో వణుకు పుట్టింది. అది దేవుడి పాము అని కొందరు అనడంతో.. తొలుత దాని దగ్గరికి వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. కానీ పాము ఊరంతా కలియ తిరగడంతో… అది ఎవర్నైనా కాటేస్తుందేమో అని అందరూ ఆందోళన చెందారు. చివరకు ధైర్యం చేసి.. దాన్ని కొట్టి చంపేశారు. ఆ పాము దాదాపు 13 అడుగులు ఉందని.. ఇంత పెద్ద పామును చూడటం చాలా అరుదని గ్రామస్థులు తెలిపారు. ఇది అట్టాంటి ఇట్టాంటి నాగుకాదు….సర్పజాతికే కింగ్‌. కింగ్‌ కోబ్రా .. ఈ మాట వింటేనే గుండెల్లో దడదడ..ఇక అది కంటపడితే … ఆ భయం గురించి చెప్పతరమా!. ఈ నాగు మాములు నాగు కాదు. కింగ్‌ కోబ్రా జాతికి చెందిన అరుదైన పాము. కింగ్‌ ఆఫ్‌ స్నేక్స్‌ అంటారు దీన్ని. ఉత్తరాంధ్రలో ఈ పాముల ఉనికి ఎక్కువ. వీటినే రాచనాగు. కొండనాగు. గిరినాగు అంటారు. ఇవి పది నుంచి 20 అడుగుల పొడవుంటాయి. మెరుపు వేగంతో దూసుకెళ్తాయి. ఇక పడగ విప్పితే సీన్‌ సితారే. విష సర్పాలు..విషంలేని పాములు , చిన్నా చితక కీటకాలే వీటి ఆహారం. చేప కోసం కొంగ జపంలా.. పొలం గట్టుపైన చెట్టులా పడగెత్తి కంటపడిన కీటకాలను చటుక్కున మింగేస్తాయి. ఇదీగాని కాటేసిందే….ఎంత సత్వరంగా వైద్యం అందించినా ప్రయోజనం ఉండదు. సెకన్ల వ్యవధిలో శరీరమంతా విషం ఎక్కుతుంది. నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. అత్యంత విషసర్పాల్లో గిరినాగు ఒకటి. జాకేరు గ్రామస్థులు గిరినాగును చంపేశారు. ఇప్పుడు భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటున్నారు. ఎంతలా అంటే కనిపించిన పాము కన్నా కన్పించని పాపభీతి ఊళ్లో వాళ్లను వేధిస్తోంది. అంతే ఓ నిర్ణయానికొచ్చారు. చచ్చిన పాముకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. రేపోమాపో గుడి కట్టాలని కూడా డిసైడయ్యారు. కాగా పామును కొట్టి చంపడం కరెక్ట్ కాదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. తమకు లేదా దగ్గర్లోని స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇస్తే.. వాటిని రెస్క్యూ చేసి అటవీ ప్రాంతంలో వదిలేస్తామని చెబుతున్నారు. ప్రజంట్ సమ్మర్ సీజన్ స్టార్టయ్యింది. వేసవి తాపానికి పాములు, వన్య ప్రాణులు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఏదైనా కంటపడితే తమకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ సిబ్బంది సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.