పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష
జనం న్యూస్ 24 సెప్టెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరంలో జిల్లా పూసపాటిరేగ మండలంలోని స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో 2023లో నమోదైన పోక్సో కేసు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ.7వేలు జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. పెద్దపతివాడ గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, కుటుంబసభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేయగా నేరం రుజువైందని చెప్పారు.