భర్తను కొట్టి మహిళపై గ్యాంగ్ రేప్.. నగ్నంగానే గ్రామానికి చేరుకున్న మహిళ..అసలు ఎం జరిగింది.?

భర్తను కొట్టి మహిళపై గ్యాంగ్ రేప్.. నగ్నంగానే గ్రామానికి చేరుకున్న మహిళ..అసలు ఎం జరిగింది.?

జనం న్యూస్: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ సంఘటన జరిగింది. సమీప పట్టణానికి వచ్చిన దంపతులు తిరిగి ఇంటికి వెళుతుండగా కొందరు దుండగులు వారిని అడ్డగించారు. భర్తపై దాడి చేసి 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. బోరియో జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు గురువారం జెట్కే కుమ్ రార్ జోరీ పట్టణానికి బైక్ పై వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణమ‌య్యారు. మార్గమధ్యలో కొందరు దుండగులు వారి వాహనాన్ని అడ్డుకున్నారు. యువతిని లాక్కెళ్ళే ప్రయత్నం చేయగా భర్త అడ్డుకున్నాడు. దీంతో అతడిని దుండగులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత వారు యువతిని సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి నుంచి తప్పించుకున్న యువతి నగ్నంగానే గ్రామానికి చేరుకుంది. విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసింది. అయితే ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు స‌మాచారం అందించ‌లేదు.