మనిషి మరణించే ముందు ఈ చిహ్నాలు కచ్చితంగా కనిపిస్తాయి... గరుడపురాణంలో నమ్మలేని వాస్తవాలు..
జనం న్యూస్: ధర్మం-అధర్మం, పాపం-పుణ్యం, స్వర్గం-నరకం, జ్ఞానం-అజ్ఞానం, నీతి-నియమాలు వంటి అనేక అంశాల గురించి గరుడపురాణంలో వివరించడం జరిగింది. గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి మరణం సమీపిస్తున్నప్పుడు అందుకు సంబంధించిన కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. ఈ సాంకేతాల ఆధారంగా సదరు వ్యక్తి జీవితం ముగింపు దశలో ఉందని తెలుస్తుందట. గరుడ పురాణం హిందూ మతంలోని 18 పురాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ గరుడ పురాణంలో, ఒక వ్యక్తి పుట్టుక నుండి మరణం వరకు అన్ని దశలు వివరించడం జరిగింది. ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన కర్మల ఆధారంగా శిక్షించబడతాడు. ధర్మం-అధర్మం, పాపం-పుణ్యం, స్వర్గం-నరకం, జ్ఞానం-అజ్ఞానం మరియు నీతి-నియమాలు గరుడపురాణంలో వివరించబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి మరణం సమీపిస్తున్నప్పుడు, అందుకు సంబంధించిన కొన్ని సంకేతాలు సదరు వ్యక్తికి కనిపిస్తాయి. తద్వారా ఆ వ్యక్తి తన జీవితం ముగింపు దశకు వచ్చిందని గ్రహిస్తారు. గరుడ పురాణం ప్రకారం.. ఈ చిహ్నాలు ఒక వ్యక్తి తన కోరికలలో కొన్నింటిని నెరవేర్చుకోవడానికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. గురుపురాణం ప్రకారం మరణానికి ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం..
1. అరచేతిపై రేఖలు మసకబారడం: గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి జీవితం ముగింపుదశకు వచ్చినప్పుడు అతని అరచేతిపై ఉన్న గీతలు మసకబారడం ప్రారంభమవుతుంది.
2. కలల్లో పూర్వీకులను చూడటం: ఒక వ్యక్తి జీవితం ముగియనున్న సమయంలో, మరణానికి కొన్ని రోజుల ముందు కలల ద్వారా సంకేతాలు అందుతాయి. పూర్వీకులు తన కలల్లో కనిపిస్తారు. కలలో పూర్వీకులు ఏడుస్తూ లేదా పారిపోతున్నట్లు కనిపిస్తే.. మరణం దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలి.
3. చుట్టూ ప్రతికూల శక్తి భావన: ఒక వ్యక్తి చుట్టూ ప్రతికూల శక్తి భావన ఉన్నప్పుడు ఏదైనా చెడు జరగబోతోందని అర్థం చేసుకోవాలి.
4. గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి మరణ గడియలు సమీపిస్తున్నప్పుడు అనేక రహస్యమైన విషయాలను చూడగలుగుతాడు. అగ్ని, వరద, భూమి విచ్ఛిన్నం వంటి అంశాలు సదరు వ్యక్తికి కనిపిస్తాయి.
5. చెడు పనులు గుర్తుకురావడం: గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు తాను చేసిన చెడు పనులను గుర్తు చేసుకుంటాడు. మనసులో ఆకస్మిక మార్పులు మొదలవుతాయి. తాను చేసిన చెడు పనులన్నీ వ్యక్తి మనసులో మెదులుతాయి. ఆ సమయంలో వారు పశ్చాత్తాపపడతాడు. అలా తాను చేసిన వాటికి పాశ్చాత్తపంగా అన్నింటినీ త్యజించాలని భావిస్తారు.
( ఈ మాటలు గరుడపురాణం అనే గ్రంథం నుంచి సేకరించినవి మేము రాసినవి లేదా నిర్ధారించినవి కావు. (జనం న్యూస్ యాజమాన్యం)