మండల సిఎం కప్ క్రీడలు ప్రారంభం
క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం
జనం న్యూస్,అనంతగిరి
క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని తహశీల్దార్ హిమబిందు,ఎంపీడీవో షేక్ సుష్మా, ఎంఈఓ తల్లాడ శ్రీనివాసరావు అన్నారు.మండల పరిధిలోని శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిఎం కప్ క్రీడలను వారు ప్రారంభించారు.ముందుగా కొద్దిసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు క్రీడల మీద అవగాహన కలిగించి, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించడంతో పాటు వారి నైపుణ్యాన్ని వెలికితీయాలానే ఉద్దేశ్యంతో సీఎం కప్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు.మండల స్థాయిలో గెలుపొందిన వారు జిల్లా,రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మండలానికి కీర్తి ప్రతిష్ఠ తీసుకురావాలని ఖంక్షసించారు.క్రీడల ద్వారా కూడా ఉద్యోగాలు సాధించవచ్చని సూచించారు.ప్రతీవిద్యార్థి కష్టపడి చదివి బంగారు భవిష్యత్‌ను అందుకోవాలని సూచించారు.ఈ కార్యదర్శులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.