మల్లికార్జున కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం భారీగా నష్టం
జనం న్యూస్ 15 డిసెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని మల్లికార్జున కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా నష్టం వాటిల్లిందని యజమానులు వెల్లడించారు సుమారు 250 క్వింటాళ్ల పత్తి అగ్నికి గురి అయిందని 20 లక్షల వరకు నష్టం జరిగిందని యాదగిరిగుట్ట ఫైర్ స్టేషన్ ఎస్సై ఎండి హమీద్ చెప్పిన వివరాల ప్రకారం కరెంటు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందని భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆలేరు యాదగిరిగుట్ట ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి ఎగిసిపడే మంటలను ఆరుపారు అని అన్నారు ఆలేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాల చైతన్య రెడ్డి యాదగిరిగుట్ట సీఐ కొండలరావు స్థానిక పోలీస్ సిబ్బంది సందర్శించి వివరాలు సేకరించారు