ఆయాచితం నటేశ్వరశర్మ ఆకస్మిక మరణం సాహిత్య లోకానికి తీరనిలోటు
జనం న్యూస్; 11 సెప్టెంబర్ బుధవారం; సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి పద్య సాహిత్యంలో ఎంతగానో కృషి చేసి, అందమైన అక్షరాలతో ప్రతినిత్యం సమాజాన్ని మేల్కొల్పుతున్న రచయిత డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ మరణం సాహితీ రంగానికి తీరని లోటని జాతీయ సాహిత్య పరిషత్, కృష్ణంవందేజగద్గురు రచయితలు అన్నారు. కామారెడ్డికి చెందిన నటేశ్వరశర్మ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. నటేశ్వరశర్మ సిద్దిపేటలో జరిగిన ఎన్నో సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దాశరధి అవార్డును అందించింది. ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదికపై పద్యాలను పాడి అలరించారు. పద్య సాహిత్యానికి ఎంతగానో కృషి చేసిన నటేశ్వరశర్మ మరణం తీరని లోటని సిద్దిపేట కవులు ఐతా చంద్రయ్య, ఎన్నవెల్లి రాజమౌళి, ఉండ్రాల రాజేశం, సింగీతం నరసింహారావు, వరుకోలు లక్ష్మయ్య, మంచినీళ్ల సరస్వతి రామశర్మ, బస్వరాజ్ కుమార్, కోనం పరశురాములు, డాక్టర్ సుధాకర్, తిరుపతి, ఆదిమూలం చిరంజీవి తదితరులు అన్నారు.