మహిళలు స్వశక్తితో ఎదగాలి:- ఏవో గంగజమున
జనం న్యూస్ డిసెంబర్ 25 శాయంపేట మండలం మహిళలు స్వాశక్తితో ఎదిగి కుటుంబ పోషణకై చేదోడు వాదోడుగా నిలవాలని వ్యవసాయ అధికారి గంగజమున అన్నారు మంగళవారం రోజున ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సిరిమువ్వ స్వశక్తి మహిళా సంఘం నిర్వాహణలో బయో ఇన్పుట్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంగాజమున పాల్గొని బయో ఇన్పుట్ సెంటర్ ను ప్రారంభించి మాట్లాడుతూ... మహిళలందరూ వ్యవసాయ రంగంలో పునరుత్పాదక వ్యవసాయ సాగు విధానంలో రసాయనిక ఎరువులు,పురుగు మందులు. తగ్గించే దిశగా ప్రయాణించాలని రాబోయే తరాలకు నాణ్యమైన భూమిని అందించే ఉద్దేశంతో ఈ ప్రజ్వల్ రైతు సంఘం నిర్వాహణలో శాయంపేట మండలంలో ప్రతి గ్రామ గ్రామాన మహిళా సంఘం ఆధ్వర్యంలో బయో ఇన్పుట్ సెంటాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ అనుముల శ్రీనివాస్ తెలిపారు దీని గాను ఆరేపల్లి గ్రామంలో ఈ బయో ఇన్పుట్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం రైతులందరూ వాడుతున్నటువంటి విచక్షణ రహిత ఎరువులను, పురుగుమందులను తగ్గించే దిశగా నాణ్యమైన భూమిని అందించే ఉద్దేశంతో ఇలాంటి సంఘాల ముందుకు రావడం ఎంతో అభినందనీయమని తెలియజేస్తూ పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ నేల సారాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ముందుగా తమ తమ క్షేత్రాలలో ఈ సేంద్రియ కార్బనాన్ని వినియోగించి రసాయనిక ఎరువులను పురుగుమందులను తగ్గించేందుకు స్వశక్తి ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలని అన్నారు, అదేవిధంగా ఈ సిరిమువ్వ స్వశక్తి మహిళ సంఘాల నిర్వహించేటువంటి బయో ఇన్పుట్ సెంటర్లో అనునిత్యం సహాయ సహకారాలు అందించిన పల్నాటి రాంబాబును అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తి దారుల సంఘం శాయంపేట ప్రొడ్యూసర్ యూనిట్ మేనేజర్ గుడిమల్ల మానస చౌదరి ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ అక్కల రమేష్ కార్యక్రమంలో క్షేత్ర సిబ్బంది మరియు సిరిమువ్వ స్వశక్తి మహిళా సంఘ సభ్యులు ఎడ్డే కవిత, జ్యోతి, అరుణ, విమల, రేణుక, లక్ష్మి, అనిత. గ్రామ బి.సి.ఐ రైతులు శ్రీనివాస్ కొమురయ్య , నాగులగాని వీరన్న ఎడ్డే నాగేశ్వరరావు ఎడ్డే రాజేందర్ ఊ కంటి రాజిరెడ్డి సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..