మహిళా వినియోగదారుల సహకార సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ గా కల్లూరి కీర్తన హన్మంతరావు.
మున్నూరు కాపు మహిళలు, రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా
కల్లూరి కీర్తన హనుమంతరావు....
జనం న్యూస్ డిసెంబర్6.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్
తెలంగాణ మున్నూరు కాపు మహిళా పరస్పర సహాయ వినియోగదారుల సహకార సంఘం రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ గా మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్ తాజామాజీ సర్పంచ్ కల్లూరి కీర్తన హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కమిటీ చైర్మన్ పుట్టం పురుషోత్తమరావు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి వీపిజే ఫంక్షన్ హాల్ లో గురువారం జరిగిన సమావేశంలో కీర్తన హనుమంతరావును నియమించడం జరిగినది. గురువారం జరిగింది. ఈసందర్బంగా పురుషోత్తమరావు మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గాన్ని తెలంగాణ మున్నూరు కాపు రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ఏర్పాటు చేశామని, మున్నూరు కాపు మహిళా పరస్పర సహాయ వినియోగదారుల సహకార సొసైటీ లిమిటెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ గా మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్ తాజామాజీ సర్పంచ్ కల్లూరి కీర్తన హనుమంతరావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమని ఆయన అన్నారు. నూతన వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికైన కల్లూరి కీర్తన హనుమంతరావు మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బడుగుల బతుకులపై ఒక అధ్యయనం చేసి మున్నూరు సంఘం రైతుల జీవితాలు బాగుపడటం కోసం ప్రతినిత్యం కృషి చేస్తానని ఆమె అన్నారు. రాష్ట్ర మున్నూరు కాపు సంఘం మహిళ పరస్పర సహాయ వినియోగదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజులలో రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి రైతులు పంటలు పండిస్తే దళారుల పుణ్యమా అని రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రహించి ఇలాంటి మహాత్తార కార్యక్రమానికి అంకురార్పణ చేయడం జరిగిందని ఆమె వివరించారు. భవిష్యత్ లో రైతులు పంటలను నేరుగా వెళ్లి అక్కడే కొనుగోలు చేయడం వల్ల రైతులకు, కొనుగోలుదారులకు నాణ్యమైన వస్తువులు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర రైతులకు, మహిళా రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర మున్నూరు సంఘం కార్యవర్గానికి, అపెక్స్ కమిటీ చైర్మన్ కుటుంబరావు, డైరెక్టర్లకు, రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కీర్తనహనుమంతరావు తెలిపారు.కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం మాజీ అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరి హనుమంతరావు, వివిధ ప్రాంతాల తెలంగాణ మున్నూరు కాపు సంఘం మహిళా సోదరులు తదితరులు పాల్గొన్నారు.