ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ధరల పట్టికలను పెట్టలే

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ధరల పట్టికలను పెట్టలే

జనం న్యూస్ 05 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా:-- ప్రైవేట్ ఆస్పత్రులలోవైద్యం పేరిట దోపిడి,ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీలను అరికట్టాలె.జ్వరం వస్తే పరీక్షల పేరిట నిలువు దోపిడి.కొమ్ముల ప్రవీణ్ రాజ్ తీన్మార్ మల్లన్న టీం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు, గట్టు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రవేట్ ఆసుపత్రిలో జరుగుతున్న దోపిడీలను అరికట్టాలని మరియు ధరల పట్టికను ఏర్పాటు చెయ్యాలని ఏర్పాటు చేసిన సమావేశంలో కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల్ జిల్లాలో జ్వరం వస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో నయం చేసుకోవడానికి వెళితే రక్త పరీక్షల పేరిట నిలువు దోపిడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో పరీక్షలు చేసి ప్లేట్లెట్స్ (రక్త కణాలు) పడిపోయినావి అని తెలుపుతున్నారు. దీనితో జ్వరం వస్తే పరీక్షల పేరిట ఆందోళన కలిగిస్తున్నారు. అయితే డెంగీ వ్యాధులు భారీగా వస్తున్నాయని ప్రైవేట్ ఆస్పత్రులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.జ్వరం వస్తే అవసరం లేకున్నా స్కానింగ్, ఎక్స్ రేలు రాస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రిలో ధరల నిబంధనలు లేకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడింది పాటగా కొనసాగుతుంది అన్నారు కొమ్ముల ప్రవీణ్ రాజ్. ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన బాధ్యతను పట్టించు కోవడంలేదని విమర్శలు ఉన్నాయి అని కొమ్ముల ప్రవీణ్ రాజ్ అన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు వైద్యపరీక్షలు, చికిత్సల ధరల పట్టికలను లేక ప్రవేట్ ఆసుపత్రి లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు కొమ్మల ప్రవీణ్. ఈ ప్రవేట్ ఆసుపత్రిలో దోపిడిని అరికట్టాలంటే తక్షణమే ప్రతి ఆసుపత్రిలో ధరల పట్టిక క్లియర్గా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రజలకు కనిపించే విధంగా ఆస్పత్రి బయట మరియు లోపల ధరల పట్టికను పెట్టే విధంగా గవర్నమెంట్ తక్షణమే ఆర్డర్స్ జారీ చేయాలని కొమ్ముల ప్రవీణ్ రాజ్ తీన్మార్ మల్లన్న టీం జోగులంబ గద్వాల జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు వైద్యపరీక్షలు, చికిత్సల ధరల పట్టికలను పెట్టే విధంగా చూడాలన్నారు కొమ్ముల ప్రవీణ్ రాజ్.కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు వైద్యపరీక్షలు, చికిత్సల పేరిట రోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయన్నారు కొమ్ముల ప్రవీణ్ రాజ్ .చట్టా ప్రకారం ప్రైవేట్‌ ఆసుపత్రులు ఏ వైద్యపరీక్షకు ఎంత ధర, చికిత్సలకు ఎంత ధర అనే బోర్డులను ప్రదర్శించాలని ఇలా ప్రదర్శించకపోతే నోటీసులు ఇచ్చి ఆపై లైసెన్సులను రద్దు చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కొమ్మల ప్రవీణ్ రాజ్ కోరారు.ఈ కార్యక్రమంలో నీల నరసింహాలు,తిరుమలేష్ పాల్గొన్నారు