మానసిక, శారీరక వికాసానికి క్రీడలు దోహదం: స్ప్

మానసిక, శారీరక వికాసానికి క్రీడలు దోహదం: స్ప్

జనం న్యూస్ 15 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
మానసిక, శారీరక వికాసానికి క్రీడలు దోహదపడతాయని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. 5వ బెటాలియన్‌ క్రీడా పోటీల ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మావోయిస్టులు, తీవ్రవాదులతో పోరాటం చేయడంలో బెటాలియన్‌కు ఘనమైన చరిత్ర ఉందన్నారు. పోలీసు అధికారులు, సిబ్బందిలో స్ఫూర్తిని నింపేందుకు గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్సు మీట్‌ను నిర్వహించుకుంటున్నామన్నారు. యువత రోజువారిలో కొంత సమయం క్రీడాలకు కేటాయించాలన్నారు.