రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహాను ఘనంగా సన్మానించిన కొడకంచి శ్రీనివాస్ గౌడ్
శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.. జనం న్యూస్ నవంబర్4.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహాను సోమవారం శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.ఈసందర్బంగా కొడకంచి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజానర్సింహాను కలవడం జరిగిందని ఆయన అన్నారు. శివ్వంపేట మండలంలోని పలు గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు, మండల కేంద్రమైన శివ్వంపేట అభివృద్ధికి కూడ ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని, అందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.మంత్రి దామోదర్ రాజనర్సింహాను కలిసిన వారిలో శివ్వంపేట మాజీ ఎంపీటీసీ జంగం విజయవెంకటేష్,బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్, మంతూరి రమేష్ గౌడ్,కొడకంచి గణేష్ గౌడ్, హమీద్, పలువురు మండల నాయకులు ఉన్నారు.