రెండు చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు

రెండు చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు

 విజయనగరం వన్ టౌన్ ఇంచార్జీ సిఐ ఎల్.అప్పల నాయుడు
జనం న్యూస్ 28 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణంలో రెండు షాపుల్లో చోరీలకు పాల్పడిన నేరస్తుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుండి చోరీ సొత్తుని రికవరీ చేసినట్లుగా విజయనగరం వన్ టౌన్ ఇంచార్జీ సిఐ ఎల్.అప్పల నాయుడు నవంబరు 27న తెలిపారు.విజయనగరం పట్టణంలో జులై 15 రాత్రి అంబికా స్వీట్ షాపులో గుర్తు తెలియని దొంగ ప్రవేశించి, రూ. 50వేలు చోరికి పాల్పడినారు.అదే విధంగా నవంబరు 25 రాత్రి గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ లోకి కూడా గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి, క్యాష్ కౌంటర్ నుండి రూ.12 వేలు దొంగిలించినట్లుగా ఇచ్చిన ఫిర్యాదులపై వన్ టౌన్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారని ఇంచార్జీ సిఐ ఎల్.అప్పల నాయుడు తెలిపారు.
ఈ నేరాలతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించిన తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం  గాదరాడ గ్రామానికి చెందిన దేవన బుజ్జయ్య @ బుజ్జి (45సం.లు) ని అరెస్టు చేశామన్నారు.నిందితుడి వద్ద నుండి గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ లో చోరి చేసిన రూ.12 వేలు, అంబిక స్వీట్స్ షాపులో చోరీ చేసిన రూ.27,100/- నగదు, సుత్తి, టార్చ్ లైట్, సెల్ ఫోను రికవరీ చేసి, నిందితుడిని రిమాండుకు తరలించామని ఇంచార్జీ సిఐ ఎల్.అప్పల నాయుడు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై హరిబాబు నాయుడు పాల్గొన్నారు.