రైతులకు ఉపయోగపడని పీఎం దామరగిద్ద చెరువు నీళ్లు

రైతులకు ఉపయోగపడని పీఎం దామరగిద్ద చెరువు నీళ్లు

చెరువు ఆయకట్టు 1100 ఎకరాలు,సాగుకు న్నోచ్చుకొని 50 ఎకరాలు

జనం న్యూస్,సెప్టెంబర్ 03,కంగ్టి 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పీఎం దామరగిద్ద చెరువు,గత మూడు రోజుల నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్న సందర్భంగా కాకి వాగు ప్రాజెక్ట్ నిండుకుండల తలపిస్తుంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు తర్వాత రెండవ అతిపెద్ద చెరువు,కాకి వాగు ప్రాజెక్టు,రైతులు ఈ ప్రాజెక్టులో నీళ్లు, రైతులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు,  కాకి వాగు ప్రాజెక్టు కింద 11,30 ఎకరాల ఆయకట్టు ఉండగా,50 ఎకరాల భూమి సాగులో ఉండకపోవడం దురదృష్టకరం.ఎడమ కాలువతో దామరిగిద్ద, బాన్సువాడ,జంమ్గి కే, 6,80 ఎకరాల భూమి  సాగులో ఉండవలసింది. పట్టుమని పది ఎకరాల భూమి సాగుకు నోచుకోకుండా పోతుంది. కుడి కాలువతో 4,50 ఎకరాల భూమి సాగు కావలసి ఉండగా అసలే సాగుకు నోచుకోకుండా పోతుంది.గత కెసిఆర్ ప్రభుత్వంలో కాల్వల, అలుగు,తూముల, మరమ్మత్తులకై,93 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తాజా మాజీ ఎంపీటీసీ ముత్యాల సాయిలు అన్నారు.కాంగ్రెస్ పార్టీ పెద్దలు టెండర్ వేసి నాసిరకప్పు పనులు చేయడం వల్ల తూములో,అలుగుల నుంచి నీళ్లు వృధాగా బయటకి వెళ్లిపోవడం జరుగుతుందని అన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల   సంజీవరెడ్డి,రైతులకు న్యాయం చెయ్యాలని రైతన్నల పక్షాన డిమాండ్ డిమాండ్ చేశారు.