లేడీ కానిస్టేబుల్ తో లాయర్ రొమాన్స్.. అడ్డంగా దొరికిపోయారు..(వీడియో చూడండి).

జనం న్యూస్: ఈ మధ్యకాలంలో పెళ్లైన కొంత మంది వ్యక్తులు వివాహేతర సంబంధానికి మొగ్గు చూపుతున్నారు. భార్యను కాదని భర్త, భర్తను కాదని భార్య. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మరో కుంపటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ చివరికి కట్టుకున్న వాళ్లను దారుణంగా మోసం చేస్తున్నారు. ఇక అంతేకాకుండా అడ్డొస్తే హత్యలు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మన దేశంలో రోజుకు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాగే ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడు లాయర్ తో గదిలో సరసాలకు దిగింది. దీంతో ఆ వివాహిత భర్తతో పాటు పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ కు చెందని ఓ యువతి ఫ్యామిలీ కౌన్స్ లింగ్ సెంటర్ పోలీస్ ఆఫీసులో మహిళా కానిస్టేబుల్ గా పని చేస్తుంది. గతంలో ఆమెకు ఓ లాయర్ పరిచయం అయ్యాడు. ఇక వీరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. ఇద్దరూ సమయం దొరికినప్పుడల్లా రొమాన్స్ ను తెగ పిండుకునేవారు. ఇదిలా ఉంటే.. ఆ మహిళా కానిస్టేబుల్ భర్తకు ఇటీవల తన భార్యపై అనుమానం వచ్చింది. ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అనుకున్నాడు. ఇకపోతే ఆ మహిళా ఇటీవల తన ప్రియుడైన లాయర్ ను ఏకంగా తన ఇంటికి రప్పించుకుంది. అదే సమయంలో ఆమె భర్త ఇంటికి వచ్చాడు. తాను అనుకున్నది నిజమే కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన పోలీసులు సైతం వాళ్లున్న ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఇంట్లో ఉండగా ఆ మహిళా కానిస్టేబుల్ భర్తతో పాటు పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదంతా పోలీసులు వీడియో తీసుకున్నారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ అడ్డంగా దొరికిపోయిన వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది.