వారినీ ఇదెక్కడి ప్లాన్ మాష్టారు.. ఐడియా భలే ఉందిగా వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.

జనం న్యూస్: దేశంలోని అనేక రాష్ట్రాలు ఎండతీవ్రత, వేడిగాలుల కారణంగా ఇబ్బంది పడుతున్నాయి. అధిక వేడి, ఉక్కపోత కారణంగా ఉదయం, సాయంత్రం తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం మానుకుంటున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల విద్యార్థులు కూడా పాఠశాలలకు రావడం మానేశారు. విద్యార్థులను స్కూల్‌కి రప్పించేందుకు గానూ కన్నౌజ్‌లో అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు స్కూల్‌ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో కన్నౌజ్‌లోని ఉమ్ర్దా బ్లాక్‌లోని మహసౌనాపూర్ ప్రాంతంలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌కి చెందినది. ఎండాకాలం కావడంతో ఎక్కువ ఎండ, వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్కూల్‌కు రావడం మానేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో స్కూల్‌ ప్రిన్సిపాల్ ఒక సరికొత్త ఆలోచన చేశారు. పరిమిత వనరులతో పిల్లల కోసం పాఠశాల ప్రాంగణంలోనే ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. పాఠశాలలోని తరగతి గదిని నీటితో నింపి, అందులో పిల్లలను సరదాగా గడిపేందుకు అనుమతించారు. దీంతో స్కూల్‌కి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ వైభవ్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. పిల్లలు స్కూల్‌ పట్ల ఆకర్షితులయ్యేలా ఏం చేద్దామా అని అందరం కూర్చుని ఆలోచించగా ఈ ఐడియా తట్టినట్టుగా స్కూల్ ప్రిన్సిపాల్ వైభవ్‌ సింగ్‌ చెప్పారు. స్మిమ్మింగ్‌ పూల్‌ నిర్మాణంతో విద్యార్థులను ఈజీగా బడికి రప్పించవచ్చుననే ఆలోచనతో ఇదంతా చేశామని చెప్పారు. దీంతో పిల్లలు వేడి నుంచి కూడా ఉపశమనం పొందుతున్నారు. పాఠశాలకు ఆకర్షితులవుతారు. ఇప్పుడు పిల్లల సంఖ్య పెరగడంతో మా ప్లాన్ వర్కవుట్ అయినట్లే అన్నారు. క్లాస్‌రూమ్‌లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్‌లో చిన్నారులు స్నానాలు చేస్తూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. వీడియో చూసిన తర్వాత, ఒక సోషల్ మీడియా వినియోగదారు, పిల్లలు భలే సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నారని రాశారు. ఈ పిల్లలు తమ జీవితాంతం ఈ రోజులను గుర్తుంచుకుంటారని ఒకరు రాశారు. ఎందుకంటే అందరికీ ఇలాంటివి పొందలేరని అన్నారు.