పెళ్లి పీటలపైనే పిచ్చ కొట్టుడు కొట్టుకున్న పెళ్లి జంట.. అసలు ఎం జరిగింది (వీడియో చూడండి).
జనం న్యూస్: సోషల్ మీడియాలో ప్రతి రోజూ వందల వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మాత్రం తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో పెళ్లికి సంబంధించినవి ఎక్కువగా ఉండటాన్ని చూసే ఉంటారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారి మధ్య ఉండే అన్యోన్యత, ప్రేమ చూపించుకోవడం, ఒకర్ని చూస్తూ మరొకరు సిగ్గు పడటం లాంటివి అందర్నీ ఆకర్షిస్తుంటాయి. ఇలాంటి మ్యారేజ్ వీడియోలు వైరల్ అవ్వడం వల్ల ఫేమస్ అయిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ వివాహ వేడుకకు సంబంధించిన ఒక పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి వేడుకలో నూతన వధూవరులు కొట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వైరల్ వీడియోలో వధువుకు వరుడు స్వీట్ తినిపిస్తూ కనిపించాడు. స్వీట్ తినడం ఇష్టం లేకో ఏమో దాన్ని తినేందుకు పెళ్లి కూతురు అయిష్టత చూపింది. కానీ దాన్ని పట్టించుకోని పెళ్లి కొడుకు స్వీట్‌ను వధువు నోట్లో కుక్కాడు. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి కూతురు.. అతడి చెంప ఛెళ్లుమనిపించింది. ఇది ఊహించని వరుడు ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. ఇద్దరూ ముష్టిఘాతాలతో రెచ్చిపోవడంతో కళ్యాణ మండపం కాస్తా మల్లయుద్ధ మైదానాన్ని తలపించింది. జుట్టు పట్టుకుని, మెడను తోసుకుని వీళ్లు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఈ గొడవను ఆపేందుకు అక్కడున్న వారు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ పాత వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.