విద్యతో పాటు కల్చర్ స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యం

విద్యతో పాటు కల్చర్ స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యం

జనం న్యూస్ 15-11-24 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి

అందోల్ లోని ప్రభుత్వ గురుకుల పాఠశాల, గర్ల్స్ జూనియర్ కాలేజీ‌లో జరిగిన టెంత్ జోనల్  లెవల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో  ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ  పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థిణులకు మంత్రి బహుమతులు అందజేశారు స్టూడెంట్స్‌తో కబడ్డి ఆడి వారిని మంత్రి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలు, విద్యార్థులే దేశ భవిష్యత్ నిర్మాతలు. అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు.  అమ్మాయిలు అధైర్యం, అభద్రతకు గురికాకూడదు. కాన్ఫిడెంట్‌గా అన్నిరంగాల్లో ముందుకెళ్లాలి ప్రతి ఒక్కరూ స్వేచ్చగా, స్వతంత్రంగా జీవించాలి.గేమ్స్, స్పోర్ట్స్‌లో పాల్గొన్న విద్యార్థిణులందరికీ నా అభినందనలు. గెలుపొందిన విద్యార్థిణులకు శుభాకాంక్షలు. ఆటల్లోనైనా, జీవితంలోనైనా గెలుపోటములు సహజం స్పోర్టీవ్‌గా తీసుకుని ముందుకెళ్లాలి.మరోసారి ఆడి గెలిచేందుకు శక్తిని కూడదీసుకుని సాధన చేయాలి‌.ఇప్పుడు చదువుల్లో పడి క్రీడలను నిర్లక్షం చేస్తున్నారు. కానీ, విద్యతో పాటు కల్చర్, స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యం. ప్రతి స్టూడెంట్ తమకు నచ్చిన ఆటలు ఆడాలి. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు.  పోటీతత్వాన్ని అలవర్చుకుంటారు. ఒత్తిడిని తట్టుకునే శక్తిని, లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను సంపాదించుకుంటారు. ఇవన్నీ ఇప్పటి జీవన విధానంలో చాలా అవసరం.   జీవితంలో ఎదగటానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.
అమ్మాయిలు చదువుల్లో, ఆటల్లో రాణించడంతో పాటు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, సమకాలిన అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.అకాడమిక్ బుక్స్‌తో పాటు, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి.మీ స్కూల్‌లో లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. అన్ని బుక్స్ అందజేస్తాం. మీకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని కల్పిస్తాం.ప్రతి స్టూడెంట్ లైబ్రరీకి వెళ్లాలి. మీకు నచ్చిన పుస్తకం చదవాలి.తల్లిని, తండ్రిని, గురువులను జీవితాంతం మరవకూడదని మన కల్చర్ చెబుతోంది. మీరంతా దాన్ని పాటించాలి. మీ స్కూల్‌ను, కాలేజీని మీరు ఓన్ చేసుకోవాలి.ఈ సమాజంలో మీరు కూడా భాగమేనని గుర్తుంచుకోవాలి. మీరు ఎదిగిన తర్వాత సమాజానికి మీ వంతు సాయం చేయాలి.