విధి నిర్వహణలో ధైర్య సాహసాలు పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాయి

విధి నిర్వహణలో ధైర్య సాహసాలు పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాయి

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 19 సెప్టెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
గంజాయి మత్తులో బీభత్సం సృష్టించిన యువకులను ధైర్య సాహసాలతో నియంత్రించిన 2వ పట్టణ కానిస్టేబులును అభినందించిన జిల్లా ఎస్పీ
విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనులో కానిస్టేబులు పి.కృష్ణ విధి నిర్వహణలో కనబర్చిన ధైర్యసాహసాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, జిల్లా పోలీసు కార్యాలయంలో సెప్టెంబరు 18న ప్రశంసా పత్రాన్ని అందజేసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - ఆగస్టు 24న సాయంత్రం విజయనగరం పట్టణం పూల్ బాగ్ కాలనీ పిజి కాలేజ్ సమీపంలో కొంతమంది యువకులు గంజాయి సేవించి, మత్తులో చుట్టు ప్రక్కల ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తున్నారని డయల్ 100కు సమాచారం అందిందన్నారు. ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనుకు అందించగా, 2వ పట్టణ పోలీసు స్టేషను అధికారుల ఆదేశాలతో కానిస్టేబులు పి.కృష్ణ మరియు హెడ్ కానిస్టేబులు జనార్ధనరావు సమస్యను పరిష్కరించేందుకు సంఘటనా స్థలంకు వెళ్ళారు. అక్కడ కొంతమంది స్థానిక యువకులు గంజాయి సేవించి, గంజాయి మత్తులో చుట్టు ప్రక్కల ప్రజలను తూలనాడుతూ, వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. గంజాయి మత్తులో ఉన్న వారిని నియంత్రించేందుకు కానిస్టేబులు కృష్ణ మరియు హెడ్ కానిస్టేబులు జనార్ధనరావు ప్రయత్నించగా, మద్యం, గంజాయి మత్తులో ఉన్న వారు పోలీసులపై దాడికి ప్రయత్నించగా, కానిస్టేబులు పి.కృష్ణ తన ప్రాణాలను లెక్క చెయ్యకుండా, వారితో తలపడి, గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని, 2వ పట్టణ పోలీసు స్టేషనులకు తరలించారని జిల్లా ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమర్ధవంతంగా వ్యవహరించి, పోలీసుశాఖ ప్రతిష్టను ఇనుమటింప జేయడమే కాకుండా గంజాయి, మద్యం మత్తులో ఉన్న యువకులను అక్కడ నుండి చెదరగొట్టి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసి, పోలీసులపై తిరుగుబాటు చేసిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న కానిస్టేబులు పి.కృష్ణను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తన కార్యాలయానికి పిలిచి, ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాన్ని అందజేసారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఇదే తరహాలో విధులు నిర్వహించి, పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఇనుమటింప జేయాలని కానిస్టేబులు పి.కృష్ణను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభిలషించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.