చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
- విజయనగరం డిస్పీ ఎం.శ్రీనివాసరావు
జనం న్యూస్ 11 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణంలో నవంబరు 7న చైన్ స్నాచింగుకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి తులం బంగారు చైను, చైన్ స్నాచింగుకు వినియోగించిన స్కూటీని సీజ్ చేసినట్లుగా విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు నవంబరు 10న తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణం పాల్ నగర్ కు చెందిన కొవ్వూరి లక్ష్మణ రెడ్డి నవంబరు 7న తన స్వంత పనుల మీద విశాఖపట్నం వెళ్ళి, ఆర్టీసి బస్సులో రాత్రి 10-30 గంటల సమయంలో విజయనగరం వచ్చి, ఆర్టీసీ కాంప్లెక్స్ లో దిగి, పి.వి.ఆర్. ఆసుపత్రి రోడ్డు మీదుగా రైల్వే స్టేషను మోటారు సైకిలు స్టాండులో ఉన్న తన మోటారు సైకిలును తీసుకోవడానికి నడుచుకుంటూ వెళ్ళుచుండగా, ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీ మీద వెనుక నుండి వచ్చి లక్ష్మణ రెడ్డిని క్రింద పడేసి, అతని మెడలోని తులం బంగారు చైను తీసుకొని, స్కూటీ మీద వెళ్ళిపోయినట్లుగా వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వన్ టౌన్ ఎస్ఐ సురేంద్ర నాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, స్నాచింగుకు పాల్పడిన వ్యక్తులను విజయనగరం పట్టణంకు చెందిన (1) మహంతి వినోద్ కుమార్ అలియాస్ వినోద్ (20 సం.లు) (2) పొట్నూరు డేవిడ్ రాజు అలియాస్ డేవిడ్ (22 సం.లు) కంటోన్మెంట్ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో అరెస్టు చేసి, వారి వద్ద నుండి తులం బంగారు చైను, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లుగా డిఎస్పీ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని, అతడి గురించి గాలిస్తున్నామన్నారు.ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన వన్ టౌన్ ఇన్చార్జ్ సిఐ ఎల్. అప్పలనాయుడు, ఎస్ఐ సురేంద్ర నాయుడు, హెడ్ కానిస్టేబులు ఎం.అచ్చిరాజు, శ్రీను మరియు ఇతర సిబ్బందిని విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు అభినందించారు.