వ్యక్తిగత భద్రత విధుల నిర్వహణలో నిరంతరం అప్రమత్తతే ప్రధానం
-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 05 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జిల్లాలోని ముఖ్యమైన వ్యక్తులకు, తీవ్రవాదులు, మావోయిస్టుల నుండి ముప్పు ఉన్న వ్యక్తులకు భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి రెండు రోజులపాటు పునశ్చరణ తరగతులను నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆర్మ్ డ్ రిజర్వు అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు డిసెంబరు 4న ముఖ్య అతిధిగా హాజరై, శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ - వ్యక్తిగత భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది తమ విధులు నిర్వహించే సమయంలో నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. భద్రత విధుల నిర్వహణలో సిబ్బందికి శారీరక దారుఢ్యం, వృత్తి నైపుణ్యం ఉత్తమంగా నిలుపుతుందన్నారు. ఈ శిక్షణలో పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యం పెంపొంచేందుకు, విఐపి సెక్యూరిటీలో నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైరింగు ప్రాక్టీసు, విఐపి భద్రత విధుల నిర్వహణలో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అన్న అంశాలు, బాంబ్ డిస్పోజల్ విధుల పట్ల పునశ్చరణ తరగతులను రెండు రోజులపాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పునశ్చరణ తరగతులను వ్యక్తిగత భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకొని, తమ వృత్తి నైపుణ్యాన్ని, శారీరక సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని ఎఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఆర్ఐ సెక్యూరిటీ శ్రీనివాసరావు, అడ్మిన్ ఆర్ ఎన్.గోపాల నాయుడు, ఎంటి ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆర్ఎస్ఐలు రామారావు, రామకృష్ణ, ముబారక్ అలీ, వర ప్రసాద్, వ్యక్తిగత భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.