శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో నేడు వినాయక చతుర్థి ప్రత్యేక పూజలు

శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో నేడు వినాయక చతుర్థి ప్రత్యేక పూజలు

అమ్మవారి ఉపాసకులు, బ్రహ్మర్శి శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో కొనసాగనున్న అమ్మవారి పూజ కార్యక్రమాలు..

ఉదయం 9 గంటల నుండి శ్రీమహాగణపతి పూజ, విశేష అర్చనలు..

మానవాళి శ్రేయస్సు కోసం స్యమంతకోపాఖ్యాన ప్రవచనము..

 జనం న్యూస్ సెప్టెంబర్ 6.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

అత్యంత శక్తిపీఠాలలో ఒకటైన శివ్వంపేట శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో నేడు శనివారం వినాయక చతుర్థి పర్వదినం సందర్బంగా బగలాముఖీ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు, అమ్మవారి ఉపాసకులు, బ్రహ్మర్శి శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖీ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు శ్రీమహాగణపతి పూజ, విశేష అర్చనలు నిర్వహించడం జరుగుతుందని అమ్మవారి ఉపాసకులు తెలిపారు. సర్వదాశ్రేయోదాయకమైన, మానవాళి శ్రేయస్సును కోరుతూ శ్రీస్యమంతకోపాఖ్యానము నిర్వహించిన అనంతరం ప్రదోషపూజ, మహాహారతి కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరుగుతుందని, అనంతరం అమ్మవారి తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించబడుతుందని, ఇంతటి మహత్తర పూజా కార్యక్రమాలకు అమ్మవారి భక్తులందరు తప్పకుండ హాజరుకావాలని ఆయన కోరారు.