స్కూల్ టీచర్ ను వెంటపడి తరిమికొట్టిన బడి పిల్లలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు (వీడియో చూడండి)

జనం న్యూస్: మద్యం మత్తులో పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడిని విద్యార్థులు తరిమికొట్టిన వీడియో మంగళవారం ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.తమకు చదువు చెప్పాల్సిన టీచర్ పీకలదాకా మద్యం తాగి రావడంతో పిల్లలు సహించలేకపోయారు. అతడిపై చెప్పులు విసురుతూ తరిమికొట్టారు. అక్కడి ప్రభుత్వ పాఠశాల టీచర్ తాగి రావడమే కాకుండా.. పిల్లలను దూషించాడు. చదువు చెప్పకుండా తిడతావా.. అంటూ చెప్పులు విసురుతూ గేటు బయట వరకు తరిమేశారు. కరెక్టుగా బుద్ధి చెప్పారంటూ నెటిజన్లు ఆ చిన్నారులను మెచ్చుకుంటున్నారు. వీడియోలోఉపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాల ఆవరణలోకి ప్రవేశించినట్లు ఆరోపిస్తూ చెప్పులు విసురుతున్న విద్యార్థుల బృందంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. చీమల దండుల కదిలి వచ్చిన విద్యార్థులకు భయపడిన తాగుబోతు టీచర్ చివరికి తన బైక్‌పై తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. X లో వీడియోను పంచుకుంటూ, ఒక జర్నలిస్ట్ ఇలా వ్రాశాడు, “ బస్తర్‌లో ఒక టీచర్ తాగి పాఠశాలకు వచ్చినప్పుడు పిల్లలు తమ చేతులకు పనిచేప్పారు.. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బడిపంతులు.. బదులుగా వారిని దుర్భాషలాడాడు. విసిగిపోయిన పిల్లలు చెప్పులు విసురుతూ తరిమికొట్టారు. వీడియోలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. వినియోగదారుల నుండి అసంఖ్యాక ప్రతిస్పందన వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిరోజూ ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని అక్కడి స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత నెలలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. అప్పుడు కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక తాగుబోతు టీచర్ మద్యం బాటిల్‌తో ప్రవేశించాడు. విషయం సోషల్ మీడియా ద్వారా ఉన్నతాధికారులకు చేరడంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారని చెప్పారు.