హాయ్యో ఎంత పని జరిగింది.. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి.

హాయ్యో ఎంత పని జరిగింది.. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి.

జనం న్యూస్: ఖాజీపేట మండల పరిధిలోని పాటిమీదపల్లెకు చెందిన డి.విజయ్‌, శశికళల కుమారుడు దుర్గాతులసీరాం (3) ప్రమాదవశాత్తు వేడినీటిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్నానం చేయించేందుకు వేడినీటిని బాత్‌రూములోని టబ్‌లో ఉంచి బట్టలు తెచ్చేందుకు ఇంటిలోకి వెళ్లగానే చిన్నారి ఆడుకుంటూ వచ్చి వేడినీటి టబ్బులో కూర్చున్నాడు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి.