శ్రీవాణీ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు ముఖ్య అతిథిగా మున్సిపాల్ చైర్మన్ కడవేర్గు
మంజుల రాజనర్సు,పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాసాల వెంకట్ లింగం హాజరు.* జనం న్యూస్ :2అక్టోబర్ బుధవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీ వాణీ స్కూల్లో మంగలవారం రోజున ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థినిలు, ఉపాధ్యాయినిలు కలిసి వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి, కోలాటాలతో నృత్యాలు చేశారు , ఉపాధ్యాయినిలు కూడా విద్యార్థులతో ఆడి పాడారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలవైన బతుకమ్మ పండుగ పైన అవగాహన కల్పించేందుకు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు.ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా బతకమ్మ పండుగను జరుపుకుంటామని ,పండుగల చరిత్ర వాటి గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేస్తున్నామన్నారు. తొమ్మిది రోజులు ,తొమ్మిది రకాల నైవేద్యాలతో బతుకమ్మ పండుగను మహిళలు ఆడుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.