100 గ్రాముల మాంసం కోసం ఒక అందమైన పక్షి ప్రాణం తీస్తే జరిగే నష్టం.

100 గ్రాముల మాంసం కోసం ఒక అందమైన పక్షి ప్రాణం తీస్తే జరిగే నష్టం.

జనం న్యూస్ 08 అక్టోబర్ 2024. జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా  :- తొలకరి జల్లుల సమయంలో తడిచిన చెట్టుకి పట్టిన చెదలు, పొడుచుకొని తిని చెట్టు చనిపోకుండ కాపడుతుంది, ఒక ఋతువులో సుమారుగా 500 వందల చెట్టులు కాపాడుతుంది.. వర్షానికి పచ్చ బడిన పచ్చికలో పురుగులు పొడుచుకొని తిని, పచ్చిక బైళ్ళు పెరిగేలా చేస్తుంది.. ఆకు పురుగులు, పూత పురుగులు లేకుండా చేస్తుంది.. కుంటలపై పురుగులు తిని, అక్కడ వేసే మలం ద్వారా భూమికి బలాన్ని ఇస్తుంది.. పాము కదలికలు పసిగడుతూ మిగిలిన ప్రాణులు, జంతువులను కాపాడుతుంది..పంటపై చీడ పీడలు తిని పంటలకు మేలు చేస్తుంది...అడవిలో వాతావరణం మార్పులు పసిగట్టి మిగతా ప్రాణులను ప్రమాద బారిన పడకుండ మేల్కొలుపుతుంది..విసర్జన ద్వారా విత్తనాలు విస్తరించి సరికొత్త మొక్కలు మొలవడానికి కారణం అవుతుంది..చిన్న పండ్లు, గింజలు నోట కరచుకొని, వదిలేస్తు, మరొక చిన్న ప్రాణులకు ఆకలి తీరుటకు కారణం అవుతుంది..ఒక పక్షి ప్రాణం, ఒక తరానికి వెలుగుతో సమానం...