వెట్టిచాకిరి చేతులతో బంధుకులు పట్టించి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ...*
ఆ మహనీయుల స్ఫూర్తితో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన..*
*నీలం మధు ముదిరాజ్..*
*చిట్కుల్లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు..*
వెట్టిచాకిరి చేతులతో బంధుక్ లు పట్టించి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్లోని ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రజక సోదరులతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగదనుల అమరత్వమేనని ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించే తత్వం అలవడిందన్నారు.
నిజాం నిరంకుశ పాలనలో శిథిలమైపోయిన బతుకులను బాగు చేయడానికి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దొరలు జమీందారుల చేతుల్లో బానిసలుగా మగ్గుతున్న బహుజనులకు స్ఫూర్తినిస్తూ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.
ఆనాడు బహుజనుల కోసం పోరాటం చేసిన ఆ మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు పంచాలనే సంకల్పంతో వీరనారి సబ్బండ వర్గాల ప్రతినిధి చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని చిట్కుల్లో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
ఆ మహనీయుల త్యాగఫలంతో వారు ఇచ్చిన స్ఫూర్తితో సిద్ధించిన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహనీయుల ఆశయాల కనుగుణంగా పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఆ మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలని సంకల్పంతో కోటి మహిళా యూనివర్సిటీ కి చాకలి ఐలమ్మ పేరుని పెట్టి ఆ వీరనారికి గుర్తింపునిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
రేవంతన్న స్ఫూర్తితో సబ్బండ మరియు బడుగు బలహీన వర్గాల హక్కులకే పోరాడుతూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా నీలం మధు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చాకలి వెంకటేష్, మాజీ ఉపసర్పంచ్ విష్ణువర్థన్ రెడ్డి,వెంకటేశ్, మురళీ, రాజ్ కుమార్,ఆంజనేయులు,నారాయణ రెడ్డి, చాకలి సత్తయ్య, చాకలి కృష్ణ,చాకలి బాబు,నర్సింలు,యాదయ్య, కిషోర్,గోపాల్, రజక సంఘం సభ్యులు,తదితరులు, పాల్గొన్నారు.